Anjali Bahishkarana Web Series Trailer: సరికొత్త పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించేందుకు రెడీ అవుతోంది హీరోయిన్ అంజలి. రీసెంట్‌గా గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అంజలి.. బహిష్కరణ  వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు రానుంది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్.. జూలై 19 నుంచి  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. గ్రామీణ కక్షల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ మొత్తం ఆరు ఎపిసోడ్స్‌గా రానుంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌ను ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో మొదలుపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?


ఈ వెబ్‌ సిరీస్‌లో అంజలి పాత్ర సరికొత్తగా ఉంది. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోయేలో పాత్రలో దుమ్ములేపింది. గతంలో ఎన్నడూ చూడని బోల్డ్ సీన్స్‌లోనూ అంజలి రెచ్చిపోయి యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ తరువాత అంజలిని చూసే కోణమే మారిపోవచ్చు. మొత్తంగా తన క్యారెక్టర్‌లో భావోద్వేగాలను ఎంతో చక్కగా అభినయించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. పల్లెటూరు భామగా జీవించేసింది. యాక్షన్‌ సీన్స్‌లో అంజలి యాక్టింగ్ మరో రేంజ్‌లో ఉంది. 


ట్రైలర్‌లో విజువలైజేషన్ సూపర్‌గా ఉంటుంది. శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్ర‌ల‌తో పాటు ఊరి పెద్ద క్యారెక్టర్‌ను ర‌వీంద్ర‌న్ విజ‌య్‌ పోషించారు. ప్రశాంతంగా ఉన్న పల్లెటూరుకు అంజలి (పుష్ప) ఎందుకు వచ్చింది..? ఆమెకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? ఎవరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ ఊరికి వచ్చింది..? ఇలాంటి ప్రశ్నలతో ట్రైలర్‌ను కట్ చేశారు. వీటికి సమాధానం తెలియాంటే జూలై 19 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానున్న‌ ‘బహిష్కరణ’ వెబ్‌ సిరీస్‌ను తప్పకుండా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా  ట్రైల‌ర్‌తో‌ ప్రేక్షకుల్లో మరింత బజ్ క్రియేట్ అయింది. ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. సిద్ధార్థ్ సదాశివుని మ్యూజిక్ అందించగా.. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా వర్క్ చేశారు.  


Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి