మాజీ ప్రియుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మొదట్నుంచీ నటి అంకితా లోఖాండే (Ankita Lokhande) పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. సుశాంత్ తల్లిదండ్రులకు మద్దతుగా నిలుస్తున్నారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) విభాగం మంగళవారం నటి రియా చక్రవర్తిని అరెస్ట్ (NCB Arrests Rhea Chakraborty) చేయడం తెలిసిందే. దీనిపై అంకితా స్పందిస్తూ.. అది ఆమె కర్మ.. ఎవరి కర్మకు వారే బాధ్యులు, జస్టిస్ అంటూ సోషల్ మీడియాలో అంకిత చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. Rhea Chakraborty's bail plea: రియా చక్రవర్తికి షాక్ ఇచ్చిన కోర్టు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రియా చక్రవర్తి తన సోదరుడు షోవిక్ చక్రవర్తి ద్వారా సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు సీబీఐ విచారణ, ఈడీ విచారణ కొనసాగుతుండగా.. గత కొన్ని రోజులుగా నార్కొటిక్స్ విభాగం సైతం డ్రగ్స్ కేసులో రియాను, ఆమె సోదరుడిని విచారిస్తున్నారు. సెప్టెంబర్ 8న రియాను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. 



రియా అరెస్ట్ అనంతరం అంకిత స్పందించింది. ‘అవకాశం, విధి వల్లనో ఏదీ దానంతట అది జరగదు. నువ్వు చేసిన పనుల వల్ల కొన్ని జరుగుతాయి. దాన్నే కర్మ అని అంటారంటూ’ రియా చక్రవర్తి అరెస్ట్‌ తర్వాత ఇలా పోస్ట్ చేసింది. Bigg Boss Telugu Voting: బిగ్ బాస్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓట్లు వేయవచ్చు 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR