Actress Avika Gor opens up on massive weight loss journey: ‘చిన్నారి పెళ్లి కూతురు’ (Chinnari pellikuthuru ) సీరియ‌ల్‌తో దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది నటి అవికా గోర్ (Avika Gor).. ఆ తర్వాత ఉయ్యాల జంపాల అనే సినిమాలో రాజ్ తరుణ్ సరసన హిరోయిన్‌గా నటించి టాలీవుడ్ (Tollywood) సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత ల‌క్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ‌, త‌ను నేను, ఎక్క‌డికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాల‌లో న‌టించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ అవికా గోర్. చివ‌రి సారిగా 2019లో వచ్చిన రాజు గారి గ‌ది 3 చిత్రంలో కనిపించిన ఈ బొద్దుగుమ్మ ఆతర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. Also read: Mahesh Babu: సర్కారు వారి పాట షూటింగ్ మొదలైందా.. నమ్రతా పోస్ట్ వైరల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడూ బొద్దుగా కనిపించే అవికా గోర్.. సంవత్సరం గ్యాప్‌లో నాజూగ్గా.. సన్నగా మారి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అవికాగోర్ శరీరాకృతి ఫొటోలను చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు. ఈ మేరకు ఈ మద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను పంచుకుంటూనే.. బొద్దుగా ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో అభిమానులతో పంచుకుంది.



ఈ మేరకు అవికా గోర్ తన అనుభవాలను పంచుకుంటూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది.. గతేడాది ఓ రోజు రాత్రి అద్దంలో నన్ను నేను చూసుకోని కన్నీళ్లు పెట్టుకున్నాను.. ఆ క్షణాలు ఇప్పటికీ నాకు బాగా గుర్తు ఉన్నాయి. చేతులు, కాళ్లు బొద్దుగా, ఉండటంతో నాకు నేనే నచ్చలేదు. శ‌రీరానికి గౌర‌వం ఇవ్వ‌నందునే ఇంత లావుగా మారాను. నా శరీరాకృతి ఏ మాత్రం న‌చ్చ‌లేదు. దీంతో ఆ ఆలోచ‌న‌ల‌తో నాకు మ‌న‌శ్శాంతి కూడా లేకుండా పోయింది. దీంతో కష్టమైనప్పటికీ మంచి డైట్‌, వ‌ర్కవుట్స్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా సాయం చేశారు. ఇప్పుడు తిరిగి అద్దంలో చూసుకొని చాలా సంతోషించాను. ఇప్పుడు నాను నేనే మెచ్చుకున్నానంటూ.. అవికా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ ప్లాన్ మారింది


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe