Actress Dia Mirza welcome baby boy: బాలీవుడ్ నటి దియా మిర్జా, వైభవ్ రేఖి తల్లిదండ్రులయ్యారు. కానీ కొన్ని నెలల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. నెలలు నిండక ముందే బాబు (Dia Mirza Gives Birth To A Baby Boy) జన్మించాడు. ఆ చిన్నారిని ఇంకా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని భావోద్వేగంతో కూడిన లేఖను దియా మిర్జా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటి దియా మిర్జా మే 14వ తేదీన ఓ బాబుకు జన్మనిచ్చింది (Dia Mirza welcome baby boy). అయితే వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. బాబు ఆరోగ్యంగా లేడని, ఇంకా ఎదగలేదని డాక్టర్లు చెప్పడంతో దియా మిర్జా, వైభవ్ రేఖి దంపతులు ఆశ్చర్యానికి లోనయ్యారు. పిల్లలు పుట్టడం అంటే మన మనసు మొత్తం వారిమీదే ఉంటుంది. ప్రస్తుతం మా ఇద్దరి పరిస్థితి అలాగే ఉందని బాలీవుడ్ నటి తన పోస్టులో పేర్కొంది. చిన్నారి నెలల నిండకముందే జన్మించడంతో అంత ఆరోగ్యంగా లేడని వైద్యులు కొన్ని నెలలుగా చికిత్స అందిస్తున్నారని తెలిపింది. Neonatal ICUలో తమ బుజ్జాయికి వైద్యులు చికిత్స అందిస్తూ వాడి ఆరోగ్యం మెరుగయ్యేందుకు శ్రమిస్తున్నారని పోస్టులో రాసుకొచ్చింది.


Also Read: Rama Rao on Duty first look: రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ లుక్ పోస్టర్



గర్భం దాల్చిన సమయంలో తలెత్తిన అనారోగ్యం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కడుపులో ఉన్న శిశువు ప్రాణానికి ముప్పు తెచ్చాయంటూ బాలీవుడ్ (Bollywood) నటి దియా మిర్జా భావోద్వేగానికి లోనైంది. తన కుమారుడి వేలును పట్టుకుని ఓ పొటోను పోస్ట్ చేసింది. తన కుమారుడికి అవ్యాన్ ఆజాద్ రేఖి (Avyaan Azaad Rekhi) అని నామకరణం చేసింది. వీడి సోదరి సమైరా, గ్రాండ్ పేరెంట్స్ చిన్నారి కోసం ఇంటి వద్ద ఎదురుచూస్తున్నారని తెలిపింది. కొన్ని రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి చిన్నారి ఇంటికి వస్తాడని కుటుంబం సంతోషంగా ఉంది.


తన ఆరోగ్యం, తన కుమారుడి ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుకున్న మద్దతుదారులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అందరికీ ధన్యవాదాలు తెలిపింది. మీ ప్రార్థనలు, ఆశీస్సులు మాకు మేలు చేశాయి. కష్టకాలంలో ఆశలు వదులుకోకూడదని, ప్రేమ, ప్రార్థన ద్వారా అంతా మేలు జరుగుతుందని నటి దియా మిర్జా పోస్ట్ చేసింది. తమ చిన్నారి ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవాలని కోరుకోవాలని, ప్రైవసీకి భంగం కలగకుండా సహకరించాలని దంపతులు మీడియాను కోరుతున్నట్లు పేర్కొన్నారు.


Also Read: Roar Of RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్, జులై 15న గెట్ రెడీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook