Making video of RRR Movie: టాలీవుడ్‌లో భారీగా అంచనాలున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. బాహుబలి, బాహుబలి 2 లాంటి ప్రాజెక్టులతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. పాన్ ఇండియా మూవీ రాజమౌళి తెరకెక్కిస్తోన్న మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి ఏదో ఒక అప్‌డేట్స్ వస్తుంటాయి.
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో భారీ అప్‌డేట్ వచ్చింది. జులై 15న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అంటూ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. 11 గంటలకు మేకింగ్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నారు. సినిమా విడుదలపై ఇటీవల రాజమౌళి మరోసారి క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాప్తి తగ్గిన అనంతరం సినిమా (RRR Movie) షూటింగ్స్ ప్రారంభం కావడంతో బైకు మీద రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వెళ్తున్న ఫొటోను వదలగా ఏ రేంజ్‌లో వైరల్ అయిందో తెలిసిందే.
Also Read: RRR Poster Editing Photos: ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ క్రేజ్ చూశారా, ఓ రేంజ్‌లో ఎడిటింగ్ చేసిన ఫ్యాన్స్
Get ready for the #RoarOfRRR! 💥
A glimpse into the making of #RRRMovie on July 15th, 11 AM. 🤘🏻@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/qghLAaspSU— BARaju's Team (@baraju_SuperHit) July 11, 2021
రామ్ చరణ్, తారక్ బైకుపై వెళ్తున్న ఫొటో పోస్టర్‌లో అక్బోబర్ 13నే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల తేదీ (RRR Movie Release Date) అని స్పష్టం చేశారు. కొమురం భీమ్‌గా తారక్ కనిపించనుండగా, అల్లూరి సీతారామరాజు పాత్రను మెగా హీరో రామ్ చరణ్ పోషించాడు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ (Ram charan)కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులను నిరాశపరచకూడదని జక్కన్న, మూవీ యూనిట్ ఓ మేకింగ్ వీడియోను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్ ఓ కీలకపాత్ర పోషించాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా ఓ మోషర్ పోస్టర్‌ను గతంలో విడుదల చేశారు.
Also Read: RRR Movie Updates: ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది, రిలీజ్ డేట్‌పై సైతం మూవీ యూనిట్ క్లారిటీ
కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్స్‌గా జీ5, నెట్‌ఫ్లిక్స్ ఉండగా, శాటిలైట్ హక్కులను జీ సినిమా, స్టార్ మా తెలుగు, తమిళం, స్టార్ కన్నడ, ఏషియా నెట్ మళయాళం దక్కించుకున్నాయని తెలిసిందే.. ఇంగ్లీష్ సహా ఇతర విదేశీ భాషలలో డిజిటల్ ప్రసారం హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్‌ఆర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook