Divya Vani to Join BJP: బీజేపీలోకి దివ్యవాణి.. అంతా సిద్ధమే కానీ?
Actress Divya Vani to Join BJP Soon: నటి దివ్య వాణి త్వరలో బీజేపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
Actress Divya Vani to Join BJP Soon: సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వసాధారణమే. తెలుగులో అలాగే తమిళంలో కూడా అనేక మంది సినీ నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే గాక సక్సెస్ కూడా అయ్యారు. ఇదే కోవలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సినీ నటి, ఒకప్పటి హీరోయిన్ దివ్యవాణి. 2019 ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన ఆమె చాలా యాక్టివ్గా ప్రచారం కూడా చేశారు. ఆ పార్టీ నుంచి రెబెల్ మహిళా లీడర్ గా పేరు తెచ్చుకున్నారు.
అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆమెకు ఎలాంటి అధికారిక పదవులు ఇవ్వలేకపోయారు. అయితే పార్టీ పరంగా ఆమెకు అధికార ప్రతినిధి హోదా అయితే కల్పించారు కానీ పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాలు కొన్ని ఆమెకు నచ్చడం లేదంటూ ఆమె కొన్ని ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే ఆమె వైసీపీలో చేరే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైసీపీ నుంచి తనకు ఆహ్వానం కూడా అందిందని టీడీపీకి రాజీనామా చేసే సమయంలో గతంలో ఆమె వెల్లడించడంతో ఇక వైసీపీలో చేరడం అధికారికమే అనుకున్నారు అందరూ.
[[{"fid":"244443","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అయితే అనూహ్యంగా ఆమె బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. తెలంగాణలో ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో అధికారం చేతికించుకోవాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి అనేకమంది సెలబ్రిటీలను, ఇతర పార్టీల నేతలను చేర్చుకునే పనిలో పడింది. అందుకే చేరికల కమిటీ అని ఒక కమిటీ నియమించి దానికి ఈటెల రాజేందర్ ను చీఫ్ గా నియమించారు. తాజాగా ఈటెల రాజేందర్తో దివ్యవాణి భేటీ అయ్యారు. సుమారు గంటపైగా వీరి భేటీ జరిగిందని త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకోనుందని ప్రచారం జరుగుతోంది.[[{"fid":"244444","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సింది. దివ్యవాణి ఒకప్పుడు తెలుగులో అనేక సినిమాలలో హీరోయిన్గా నటించారు. తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఈ మధ్యనే సినీ రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన లక్కు పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడంతో ఆమె ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ అయినా ఆమెకు కలిసి వస్తుందేమో చూడాలి మరి.
Also Read: Bigg Boss 6 Telugu Nominations: నామినేషన్స్ షురూ.. డేంజర్ జోన్లో ఏడుగురు.. ఎవరెవరంటే?
Also Read: Nagarjuna Emotional: వైరల్ వీడియో.. కన్నీరు పెట్టుకున్న హీరో నాగార్జున! కారణం ఏంటంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి