Actress Kanishka Soni Marrys her self and Gives storing Reply To Trolls: బాలీవుడ్ నటీమణి ఒకరు తనను తాను పెళ్లి చేసుకుని షాకిచ్చింది. 'దియా ఔర్ బాతీ హమ్' ఫేమ్ టెలివిజన్ నటి కనిష్క సోనీ తన అద్భుతమైన నటనకు మంచి పేరు సంపాదించింది. అయితే ఇప్పుడు ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో వార్తల్లోకి ఎక్కింది. అసలు విషయం ఏమిటంటే కొన్నాళ్ల క్రితం ఒక గుజరాతీ యువతి తనను తాను పెళ్లి చేసుకుంది కదా ఇప్పుడు ఈ నటి కూడా అలానే తనను తాను వివాహం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంటే రెండవ సోలోగామీ యువతిగా ఈమె రికార్డులకు ఎక్కింది. ఇక  స్వయంభార్యత్వం అంటే తనను తాను వివాహం చేసుకోవడం. కనిష్క సోనీ తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో, కొంతమంది నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారని, భారతీయ సంస్కృతిపై నాకు పూర్తి నమ్మకం ఉందని కనిష్క సోనీ పేర్కొంది.  కనిష్క సోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటోలను పోస్ట్ చేసింది.  అందులో ఆమె క్యాజువల్స్ ధరించి నుదిటిపై సింధూరం కూడా పెట్టుకుంది.


అంతేకాకుండా 'మంగళసూత్ర' కూడా ధరించింది. ఆ ఫోటోను షేర్ చేసుకుంటూ ఆమె భారతీయ సంస్కృతిని నమ్ముతానని క్యాప్షన్‌లో లాంగ్ నోట్ రాసింది. నేను నా కలలన్నింటిని నెరవేర్చుకున్నందున నన్ను నేను వివాహం చేసుకున్నాను, నేను ప్రేమించే ఏకైక వ్యక్తి నేనే. నాకు ఎప్పుడూ వేరే మనిషి అవసరం లేదు. నేను ఎప్పుడూ ఒంటరిగా మరియు నా గిటార్‌తో ఒంటరిగా సంతోషంగా ఉంటాను, నేను సంతోషంగా ఉన్నాను, బలంగా అలాగే శక్తివంతంగా ఉన్నాను, శివుడు - శక్తి అంతా నాలో ఉంది, ధన్యవాదాలు అంటూ ఆమె  చెప్పుకొచ్చింది.


కనిష్క సోనీ తనను తాను వివాహం చేసుకోవడం కొంతమందికి అర్థం కాలేదు దీంతో కనిష్క పోస్ట్‌పై ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె ఒక వీడియో మెసేజ్ షేర్ చెయ్యడం ద్వారా ట్రోల్స్‌కు తగిన సమాధానం ఇచ్చింది.  కనిష్క సోనీ వీడియోలో మాట్లాడుతూ తన పోస్ట్‌పై చాలా విచిత్రమైన వ్యాఖ్యలు వస్తున్నాయని గమనించానని, అక్కడ నన్ను నేను పెళ్లి చేసుకోవడం గురించి ప్రస్తావించాను అంతేకాక ఈ పెళ్లి విషయంలో నేను గట్టి నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.


నేను సైన్స్‌ని విస్మరించానని చాలా మంది అంటున్నారు, అలాగే  నేను ఎవరితో సెక్స్ చేస్తానని అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా పురోగతి సాధించింది, ఇప్పుడు స్త్రీకి సెక్స్ కోసం పురుషుడు అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాక కనిష్క తనను తాను పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని కూడా తన వీడియోలో వెల్లడించింది. తాను గుజరాత్ సంప్రదాయవాద కుటుంబానికి చెందిన దానిని అని, పెళ్లి చేసుకోవాలనేది నా కల కానీ మాటలకు కట్టుబడి ఉండే వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ కలవలేదని చెప్పుకొచ్చింది. పురుషులు తాము చెప్పేదానికి కట్టుబడి ఉండరని నేను అర్ధం చేసుకున్నానని, అందుకే జీవితాంతం మనిషి లేకుండా జీవించగలననే నమ్మకం నాకుందని ఆమె చెప్పుకొచ్చారు.


సంపాదిస్తున్నానంటే నాకు మనిషి అవసరం లేదని, చెప్పుకొచ్చింది. అలాగే 90 శాతం మంది మహిళలు పెళ్లి చేసుకుని సంతోషంగా లేరని ఆమె అన్నారు. మగవాళ్ళ మీద నాకున్న నమ్మకం పోయిందని చెప్పుకొచ్చింది. అలాగే కనిష్క వివాహం సెక్స్ గురించి కాదని, ఇది ప్రేమ - నిజాయితీకి సంబంధించినదని పేర్కొన్నారు. ఆ నమ్మకాన్ని కోల్పోయానని బయట ప్రపంచంలో కలవడం కష్టంగా మారినప్పుడు ఒంటరిగా ఉండటం ద్వారా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మంచిదని నమ్ముతున్నానని అంటున్నారు. నా పోస్ట్‌ని ట్రెండ్ చేసి వార్తల్లోకి తెచ్చినందుకు చాలా ధన్యవాదాలని చెప్పిన ఆమె కొత్త చర్చకు దారి తీసింది. 
Read Also: Mahesh Babu Bare body : మొట్టమొదరిసారిగా షర్ట్ లేకుండా దర్శనమిచ్చిన మహేష్ బాబు


Read Also: Taapsee Pannu Dobaaraa Collections: తాప్సీ సినిమాకి దారుణమైన రెస్పాన్స్.. మొదటి రోజు ఎన్ని లక్షలంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి