Taapsee Pannu Dobaaraa Collections: తాప్సీ సినిమాకి దారుణమైన రెస్పాన్స్.. మొదటి రోజు ఎన్ని లక్షలంటే?

Taapsee Pannu starrer Dobaaraa Box Office Collection Day 1: తాప్సీ పన్ను నటించిన దొబారా సినిమాకు చాలా దారుణమైన రెస్పాన్స్ అందుతోంది. మొదటి రోజు ఆ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయనేది కలెక్షన్ రిపోర్టులో చూద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2022, 03:20 PM IST
Taapsee Pannu Dobaaraa Collections: తాప్సీ సినిమాకి దారుణమైన రెస్పాన్స్.. మొదటి రోజు ఎన్ని లక్షలంటే?

Taapsee Pannu starrer Dobaaraa Box Office Collection Day 1: తాప్సీ పన్ను నటించిన 'శభాష్ మిథు' సినిమా కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా పెద్దగా చూపించలేకపోయినప్పటికీ ఈసారి ‘దొబారా’ అనే సినిమాతో సస్పెన్స్,   థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగిందనే చెప్పాలి. తాప్సీ పన్ను ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపించింది.

పావైల్ గులాటి,   నాసర్,   రాహుల్ భట్,   హిమాన్షి చౌదరి,   శాశ్వత ఛటర్జీ,   నిధి సింగ్ వంటి నటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.'దోబారా' సినిమాను దర్శక నిర్మాత ఏక్తా కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ ఆధ్వర్యంలోమొ కొత్త వింగ్ అయిన కల్ట్ మూవీస్‌తో విడుదల చేశారు. తాప్సీ పన్ను ఈ సినిమా కోసం దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి రెండవసారి పని చేసింది. అంతేకాక విడుదలకు ముందే ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్స్  ఫాంటాసియా ఫిల్మ్ ఫెస్టివల్,   లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది.

అదే సమయంలో,   ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు కూడా చాలా మంచి రివ్యూలు ఇచ్చారు. ఈ దొబారా మూవీని దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ బడ్జెట్ చాలా తక్కువే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెనింగ్ లోనే మంచి వసూళ్లు రాబడితే కానీ ఆ డబ్బు వెనక్కి రాబట్టడం కష్టం. తాప్సీ పన్ను నటించిన దొబారా చిత్రం ఆగస్ట్ 19 న థియేటర్లలో విడుదలైంది,   ఈ సినిమాకు మొదటి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడంలో కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడిందని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. ఈ సినిమా వసూళ్ల గురించి చెప్పాలంటే,   విడుదలైన ,  మొదటి రోజు రూ.72 లక్షలు రాబట్టింది. ఇది ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ. సినిమాకు సంబంధించి మొదటి రోజు కేవలం 20-35 లక్షల వసూళ్లు వస్తాయని అంతా భావించారు.  అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ డ్రామాలో తాప్సీ నర్సు పాత్రలో నటించింది. 2018లో విడుదలైన స్పానిష్ సినిమా మిరాజ్‌కి ఇది హిందీ రీమేక్. 

Also Read: Mahesh Babu Bare body : మొట్టమొదరిసారిగా షర్ట్ లేకుండా దర్శనమిచ్చిన మహేష్ బాబు

Also Read: Karthikeya 2 Collections: కార్తికేయ 2 ఏడు రోజుల కలెక్షన్స్.. రివర్స్ లో షాకిస్తున్న వసూళ్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News