Tollywood మహానటి Keerthy Suresh ఖాతాలో అరుదైన ఘనత, Forbes జాబితాలో చోటు
Keerthy Suresh In Forbes 30 Under 30 List: మహానటి సినిమాతో లెజెండరీ నటి సావిత్ర పాత్రలో జీవించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసి జాతీయ అవార్డు సైతం కొల్లగొట్టింది అందాల భామ కీర్తి సురేష్. తాజాగా ఈ నటి మరో అరుదైన ఘనత సాధించింది.
Keerthy Suresh In Forbes 30 Under 30 List: సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఈమెకు అందం తప్ప అభినయం రాదన్నారు. ఒక్క సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించింది నటి కీర్తి సురేష్. మహానటి సినిమాతో లెజెండరీ నటి సావిత్ర పాత్రలో జీవించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసి జాతీయ అవార్డు సైతం కొల్లగొట్టింది అందాల భామ కీర్తి సురేష్(Actress Keerthy Suresh). తాజాగా ఈ నటి మరో అరుదైన ఘనత సాధించింది.
ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో నటి కీర్తి సురేష్‌కు స్థానం దక్కింది. ప్రతిభావంతుల జాబితాలో చోటు దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా 30 ఏళ్ల వయసులోపు ఉన్న భారతీయ యువతీయువకుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ‘థర్టీ అండర్ థర్టీ’ పేరుతో విడుదల చేసిన జాబితాలో ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో కీర్తి సురేష్(Keerthy Suresh) నిలిచింది.
Also Read: Pushpa shooting: ఫ్యాన్స్ మధ్య Allu Arjun.. ఫోటోలు, వీడియో వైరల్
ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ తనకు అరుదైన గౌరవం లభించడంపై స్పందించింది. ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కినందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొంది. ఫోర్బ్స్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసింది కీర్తి సురేష్.
Also Read: Uppena Trailer : అంచనాలు పెంచిన ఉప్పెన ట్రైలర్
కాగా, దక్షిణాది ఇండస్ట్రీలో కీర్తి సురేష్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సైతం చేస్తూ విలక్షణతకు పెద్దపీట వేస్తోంది. ఆమె నటించిన మిస్ ఇండియా సినిమాతో చివరగా వెండితెర మీద కనిపించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook