Lakshmika Sajeevan Passes away: మాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. యువ నటి లక్ష్మిక సజీవన్ (24) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో లక్ష్మిక తుదిశ్వాస విడిచారు. ఈమె మరణం మలయాళ పరిశ్రమను షాక్‍కు గురిచేసింది. 'కాక్క' అనే షార్ట్‌ఫిల్మ్‌లో పంచమిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో నటించారు. సౌదీ వెల్లక్కా, పంచవర్ణతతా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాథక్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ఒరు యమనందాన్ ప్రేమకథలోనూ లక్ష్మిక నటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్మిక చివరిగా 2021లో 'కూన్' అనే సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ప్రశాంత్ మొలికల్ దర్శకత్వం వహించారు. లక్ష్మిక సజీవన్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాకండా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టులు పెడుతున్నారు.  రీసెంట్ గా లక్ష్మిక తన తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఓ పోస్ట్ చేశారు. సూర్యుడు అస్తమిస్తున్నప్పటి ఒక అందమైన ఫోటోను షేర్ చేసి.. ''హోప్. లైట్ డిస్పయిట్ ఆల్ ఆఫ్ ది డార్కెనెస్'' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్ట్ పెట్టి వారం తిరగకుండానే కన్నుమూయడం శోఛనీయమనే చెప్పాలి.


Also Read: Hi Nanna Day 1 Collections: హాయ్ నాన్న మూవీకి ఊహించని కలెక్షన్స్.. నాని కెరీర్ లోనే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి