Hi Nanna Collections Update: నేచురల్ స్టార్ నాని హీరోగా సీతారామమ్ సినిమాతో మన అందరిని ఎంతగానో ఆకట్టుకున్న మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమానే 'హాయ్ నాన్న'. నిన్న డిసెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్స్ ద్వారా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
కొత్త దర్శకుడు శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ సినిమాని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ లో కనిపించగా ఈ చిత్రానికి ఖుషి సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఇచ్చాడు.
ఈ సినిమా టీజర్ నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం మొదటి రోజు ఈ చిత్రం నిండా మునిగింది. హాయ్ నాన్న మూవీ హీరో నాని నటించిన రీసెంట్ సినిమాలలో అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. దాదాపుగా సినిమాలు అన్ని శుక్రవారం విడుదలవుతాయి. కానీ ఆ సెంటిమెంట్ మారుస్తూ గురువారం రిలీజైన హాయ్ నాన్న తొలిరోజు వరల్డ్ వైడ్‌గా కేవలం పదకొండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను, ఐదున్నర కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు కేవలం రెండు కోట్ల తొంభై లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక నైజాం లో కోటిన్నర వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మిగిలిన చోట్ల కలెక్షన్స్ పరంగా పూర్తిగా తేలిపోయింది. అయితే తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్ర కలెక్షన్స్ పరవాలేదు అనిపించుకున్నాయి. ఈ సినిమా మొదటి రోజు రెండు కోట్లకుపైనే కలెక్షన్స్ దక్కించుకున్నది.
నాని గత సినిమా దసరా మొదటి రోజు 13 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకోగా ఇప్పుడు హాయ్ నాన్న చిత్రం మాత్రం ఆ సినిమాకి దరిదాపుల్లో కూడా నిలవకపోవడం గమనార్హం.అంతేకాదు నాని కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలిన అంటే సుందరానికి సినిమా కూడా తొలిరోజు మూడు కోట్ల ఎనభై లక్షలు కలెక్ట్ చేసింది. అయితే ఆ సినిమా కంటే హాయ్ నాన్నకు తక్కువ కలెక్షన్స్ రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కథ, కథనాలతో సినిమా తెరకెక్కడం, సాంగ్స్ కూడా పెద్దగా జనాల్లోకి ఎక్కకపోవడం ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ పై బాగా ప్రభావం చూపించింది అన్న విషయం అర్థమవుతుంది.
కాగా నాని ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం కి వరల్డ్ వైడ్‌గా దాదాపు 27 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ తొలిరోజు వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.
Also Read: New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..
Also Read: CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి