Annapoorani: అన్నపూర్ణ వివాదంపై నయనతార క్షమాపణలు…జైశ్రీరామ్ అంటూ పోస్ట్..
Nayantara Apologizes: సౌత్ ఇండియా లేడి సూపర్ స్టార్ నయనతార 75 వ సినిమాగా వచ్చిన అన్నపూర్ణి. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అది చాలడు అన్నట్టు ఈ సినిమా వివాదాలలో కూడా చిక్కుకునింది…
Nayantara Says Jai Shri Ram: నయనతార 75వ సినిమా అన్నపూర్ణ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం.. కొద్ది రోజుల క్రితమే ఓటీటీలో కూడా రిలీజ్ కాగా అప్పటినుంచి ఈ చిత్రం చుట్టూ అలానే నయనతార చుట్టూ ఎన్నో వివాదాలు అలుముకున్నాయి. ఈ సినిమా కథ ప్రకారం హిందువుల అమ్మాయి చెఫ్ కావడం కోసం నాన్ వెజ్ వండుతుంది. అయితే తనను నాన్ వెజ్ తినడానికి ప్రోత్సహిస్తూ పక్కన ఉన్న ముస్లిం హీరో.. పురాణాల్లో దేవుళ్ళు సైతం నాన్ వెజ్ తిన్నారు అంటూ వ్యాఖ్యలు చేస్తాడు. అందువల్లనే సినిమాలో హిందువులను కించ పరిచే సన్నివేశాలున్నాయంటూ, లవ్ జిహాదీని ప్రోత్సహించేలా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు ఈ సినిమాపై కేసు వేసాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అన్నపూర్ణి సినిమాతో పాటు నయనతారపై కూడా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సైతం సినిమాను స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. ‘అన్నపూర్ణి’ సినిమాని ఏ వర్గాన్నీ కించపర్చే ఉద్దేశ్యంతో తెరకెక్కించలేదనీ, ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే క్షమాపణ కోరుతున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నయనతార కూడా ఈ విషయంపై స్పందిస్తూ క్షమాపణలు చెప్పుకొచ్చింది.
ఓం జైశ్రీరామ్ అనే పదాలు ఉండే లెటర్ ప్యాడ్ పై ఒక సుదీర్ఘ లేఖ రాసి షేర్ చేసింది నయనతార. సానుకూల సందేశాన్ని అందించేందుకు తాము చేసిన ప్రయత్నం అనుకోని రీతిలో ఇతరులకు బాధ కలిగించి ఉండవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.
“మేము అన్నపూర్ణ సినిమాని పాజిటివ్ మెసేజ్ ని అందిచటానికి చేసిన మా హృదయపూర్వక ప్రయత్నంలో, మేము అనుకోకుండా మీకు బాధ కలిగించి ఉండవచ్చు. OTT ప్లాట్‌ఫారమ్ నుండి గతంలో థియేటర్‌లలో ప్రదర్శించబడి సెన్సార్ చేయబడిన సినిమా తీసివేయబడుతుందని మేము ఊహించలేదు. నా టీమ్,మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఎప్పుడూ అనుకోలేదు . ఈ సమస్య యొక్క తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. భగవంతుడిని పూర్తిగా నమ్మే వ్యక్తిగా మరియు దేశంలోని దేవాలయాలను తరచుగా సందర్శిస్తున్న నేను మరోసారి ఇలాంటి పొరపాటు నా సినిమాలలో జరగనివ్వను. ఈ సినిమా ద్వారా మనస్సులు గాయపడ్డవారికి నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను” అంటూ క్షమాపణలు కోరింది నయనతార.
‘సినీ పరిశ్రమలో గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న నా ప్రయాణం ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే - కేవలం పాజిటివిటీని పంచడం, ఒకదాని నుంచి మరొకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్లడం’ అంటూ తన కెరీర్ గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. మరి ఇప్పటికైనా ఈ వివాదం ముగుస్తుందో లేదో చూడాలి.
Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ
Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter