కరోనా వైరస్‌ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ పాటిస్తుండటంతో యావత్ ప్రజానీకం లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం అయ్యారు. సాధారణ ప్రజలు ఈ క్వారంటైన్‌ సాదాసీదాగానే గడుపుతున్నప్పటికీ.. సమయం విలువ తెలిసిన వాళ్లు, కాస్తో, కూస్తో డబ్బున్నోళ్లు మాత్రం ఆన్‌లైన్‌లో పాఠాలు వింటూ తమ సమయాన్ని వృధా కాకుండా చూసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇస్మార్ట్ శంకర్ చిత్రం హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా సినిమాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం నటనకు సంబంధించిన కొత్త మెళకువలు నేర్చుకుంటోందట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


లాక్ డౌన్ కారణంగా అన్ని భాషల్లోని సినీ పరిశ్రమలు షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చాయి. అలా వచ్చిన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడెమీ వారు ఆన్‌లైన్‌‌లో ఇచ్చే తరగతులకు నిధి అగర్వాల్ హాజరవుతోంది. ఈ ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా నటనకు సంబంధించిన పాఠాలు నేర్చుకుంటోందట. నటనతో పాటు స్క్రిప్ట్‌ రైటింగ్‌, దర్శకత్వంలో మెళకువలు  నేర్చుకునే ఉద్దేశంతోనే ఈ ఆన్‌లైన్ క్లాసెస్‌కి హాజరవుతున్నట్టు నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..