Kannappa Movie: మంచు విష్ణు `కన్నప్ప` నుంచి తప్పుకున్న హీరోయిన్.. కారణం ఇదే!
Manchu Vishnu New Movie: మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మూవీ స్టార్ట్ కాకముందే పెద్ద దెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టు నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుని షాక్ ఇచ్చింది.
Vishnu Kannappa Updates: ‘జిన్నా’ సినిమా తర్వాత మంచు విష్ణు చేస్తున్న సినిమా కన్నప్ప. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా విష్ణు పేర్కొన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరి కన్నప్ప సినిమాను ప్రారంభించారు మేకర్స్. అయితే ఈ సినిమా మెుదలుకాకముందే పెద్ద దెబ్బతగిలింది. కన్నప్ప సినిమా నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంది. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు మంచు విష్ణు.
మా సినిమాకు డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల హీరోయిన్ నుపుర్ సనన్ మా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఈ విషయం చెబుతున్నందుకు బాధగా ఉంది. ఆమెను మేము ఎంతో మిస్ అవుతున్నాం. అలాగే కొత్త హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టాం. నుపుర్ సనన్ నటిస్తోన్న ఇతర ప్రాజెక్టులన్నీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్యూచర్ లో నుపుర్ సనన్‍తో కలిసి నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. ఎగ్జయిటింగ్ రోజులు ముందున్నాయి. కన్నప్ప అప్డేట్స్ కోసం వేచి చూడండి" అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ నుపుర్ సనన్ తప్పుకోవడానికి కారణలేంటా అని ఆరా తీసే పనిలో ఉన్నారు.
Also Read: Rocky Aur Rani ki Prem Kahani: ఓటీటీలోకి వచ్చేసిన రణ్‌వీర్ నయా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇదిలా ఉంటే, నుపర్ సనన్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి. ఆదిపురుష్, వన్ నేనొక్కడినే సినిమాలతో కృతిసనన్ టాలీవుడ్ లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నుపుర్ సనన్ రవితేజతో టైగర్ నాగేశ్వరరావు మూవీ ద్వారా టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. మరోవైపు ఈ బ్యూటీ హిందీలోలో నూరాని చేహ్రా అనే సినిమా చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook