Pallavi Joshi Injured in Movie Shooting: గత ఏడాది ది కాశ్మీరీ ఫైల్స్ వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు వివేక్ రంజన్ అగ్రిహోత్రి. ప్రస్తుతం ఆయన ది వాక్సిన్ వార్ అనే సినిమా చేస్తున్నారు. కోవిడ్ 19 వచ్చిన తర్వాత దేశంలో ఉన్న పరిస్థితులు, కరోనా కోసం వ్యాక్సిన్ తయారు చేసే నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే విషయం మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనుపమ్ ఖేర్, నానాపటేకర్, దివ్య సేద్, పల్లవి జోషి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో తాజాగా కన్నడ సూపర్ హిట్ సినిమా కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో సప్తమి గౌడ పాల్గొంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు వివేక్ రంజాన్ అగ్రిహోత్రి, భార్య నటి పల్లవి జోషి ఈ సినిమా షూటింగ్ లో భాగంగా గాయపడినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుండగా కారు చేజింగ్ సీన్ షూట్ చేస్తున్నారని ఆ సమయంలో కారు అదుపుతప్పడంతో కారు వెళ్లి పల్లవి జోషిని ఢీకొన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశానికి సంబంధించి సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వ్యాక్సిన్ వార్ సినిమాని నిర్మిస్తూ ఉండడంతోపాటు ఈ సినిమాలో పల్లవి జోష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని సహ నిర్మిస్తున్నారు.


ఈ ఏడాది ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలతో పాటు ఉర్దూ, ఇంగ్లీష్, గుజరాతి, పంజాబీ, భోజపురి, మరాఠీ అస్సామీలో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు/ అయితే పల్లవి జోషికి ఏం జరిగింది? ఆమె ఆరోగ్య వివరాలు ఎలా ఉన్నాయి అనేది సినిమా యూనిట్స్ బంధిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Also Read: RGV Vyuham Update: జగన్ బయోపిక్ కాదిది.. ఆ పరిస్థితులే ఆధారంగా వ్యూహం.. బయటపెట్టిన వర్మ!


Also Read: Dil Raju Love Story: 'రెండో భార్యతో లవ్ స్టోరీ' బయటపెట్టిన దిల్ రాజు.. అలా కుదిరేసిందట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook