Dil Raju Love Story: 'రెండో భార్యతో లవ్ స్టోరీ' బయటపెట్టిన దిల్ రాజు.. అలా కుదిరేసిందట!

Dil Raju Reveals his Love Story: తన మొదటి భార్య అనిత మరణంతో ఒంటరి అయిన దిల్ రాజు ఆ మధ్య తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నారు, అయితే తాజాగా ఆయన తన ప్రేమ కధను బయట పెట్టారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 16, 2023, 06:53 PM IST
Dil Raju Love Story: 'రెండో భార్యతో లవ్ స్టోరీ' బయటపెట్టిన దిల్ రాజు.. అలా కుదిరేసిందట!

Dil Raju Reveals his Love Story with Second wife: తెలుగులో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా ఒకరిగా ఉన్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో కూడా సై అంటే సై అంటూ చివరి వరకు పోటీ పడి ఎట్టకేలకు వారసుడు సినిమాని వాయిదా వేసుకున్నారు. అయితే టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న ఆయన తన మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. సుమారు మూడేళ్లపాటు ఒంటరి జీవితం గడిపిన ఆయన ప్రేమించి మరీ తేజస్విని అనే ఒక యువతిని పెళ్లాడారు. అయితే ఇప్పటివరకు ఇదంతా పెద్దలు కుదిర్చిన పెళ్లి అని అందరూ అనుకుంటూ వచ్చారు.

కానీ తాజాగా ఇది లవ్ స్టోరీ అనే విషయాన్ని బయట పెట్టాడు దిల్ రాజు. అసలు దిల్ రాజుకి తేజస్వినికి ఎలా పరిచయమైంది? వారి వివాహానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనే విషయాలను సంక్రాంతి సందర్భంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ అనిత మరణించిన తర్వాత రెండేళ్లు చాలా కష్టాలు అనుభవించాను, అప్పటికే నాకు 47 ఏళ్లు ఉన్నాయి, జీవితంలో మళ్లీ ముందుకు వెళ్లాలనుకుంటున్న సమయంలో రెండు మూడు ఆప్షన్స్ వచ్చాయి కానీ బిజీ లైఫ్ కారణంగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలనుకున్నాను. అలా నేను విమానంలో ప్రయాణం చేసే సమయంలో తేజస్విని పరిచయమైంది.

నాకు నచ్చడంతో ఫోన్ నెంబర్ తీసుకుని దాదాపు ఏడాది పాటు ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేశా. ఆ ఏడాది తర్వాత ప్రపోజ్ చేశాను, ఆమెకు నచ్చడంతో ఆమె ఫ్యామిలీతో చర్చలు జరపడం, చివరికి పెళ్లి వరకు వెళ్లిందని చెప్పుకొచ్చారు. తేజస్వినిలో తనకు బాగా నచ్చిన విషయం చాలా గ్రౌండ్ టు ఎర్త్ అని చెప్పుకొచ్చారు. ఇక తేజస్విని దిల్ రాజు ఎలా పరిచయమయ్యారు అనే విషయాన్ని వెల్లడిస్తూ తాను ఎయిర్ లైన్స్ లో పని చేసేదాన్ని అని కొన్నాళ్లలో అమెరికా వెళ్లి పీజీ చేయాలి అనుకుంటున్న సమయంలో మా ఎయిర్ లైన్స్ లో రెగ్యులర్గా ట్రావెల్ చేసే దిల్ రాజు పరిచయమయ్యారని చెప్పుకొచ్చింది.

మొదటిసారి పరిచయమైనప్పుడు పెన్ అడిగారని తర్వాత నేను షిఫ్ట్ లో ఉన్నప్పుడు విమానంలో తరచూ కనిపించేవారని అలా మా మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమ వరకు వెళ్లి, పెళ్లికి దారి తీసింది అని చెప్పుకొచ్చారు. ఇక వివాహం చేసుకున్న తర్వాత తేజస్విని పేరు మార్చి వైఘారెడ్డిగా మార్చిన దిల్ రాజు ఇటీవలే ఒక మగ బిడ్డకు కూడా తండ్రి అయ్యాడు. 

Also Read: YCP MLA Biyyapu: వాల్తేరు వీరయ్య థియేటర్ బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.. అందరికీ ఫ్రీ షో!

Also Read: Waltair Veerayya Day 3 Collections: 'వాల్తేరు వీరయ్య' మాస్ రెండో రోజు కంటే మూడో రోజే ఎక్కువ.. 100 కొట్టేసిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News