Actress Pavitra Lokesh lodges complaint: తన తండ్రి మైసూర్ లోకేష్ నట వారసురాలిగా కన్నడ సినీ రంగ ప్రవేశం చేసిన పవిత్ర లోకేష్ గత కొద్దిరోజులుగా నటుడు నరేష్ తో ఉన్న రిలేషన్ విషయంలో వార్తల్లోకి ఎక్కుతున్నారు. గత కొద్దికాలం నుంచి తెలుగు మీడియాలో వారిద్దరి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వారిద్దరికీ వివాహం అయిపోయింది అని ఒకసారి, లేదు సహజీవనం చేస్తున్నారని ఒకసారి ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కథనాలు సృష్టిస్తున్నారు. అసలు విషయం ఏమిటనేది వారిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఈ వ్యవహారంలోకి ఇప్పుడు నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఎంటర్ కావడంతో సమస్య మరింత జటిలం అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక కన్నడ మీడియా ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో పవిత్ర తాను, నరేష్ సహజీవనం చేస్తున్నామని దీనికి కృష్ణ కుటుంబం సపోర్ట్ కూడా ఉందని వెల్లడించారు. ఆ తర్వాత అదేమీ లేదని నరేష్ ఒక వీడియో, పవిత్ర మరో వీడియో విడుదల చేశారు. నరేష్ భార్య రమ్య రఘుపతి ఒక చీటర్ అని డబ్బు కోసం ఏమైనా చేసే మనిషి అని అంటూ ఆమె విషయంలో తమను సపోర్ట్ చేయాల్సిందిగా వీరిద్దరూ కోరారు. తాజాగా పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఉన్న హోటల్ కి వెళ్లిన రమ్య రఘుపతి వారి మీద చెప్పుతో దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 


ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు నటి పవిత్ర లోకేష్ మైసూరులోని వివిపురం పోలీస్ స్టేషన్లో ఇద్దరు జర్నలిస్టుల మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారు తనను వెంబడిస్తూ తన మానసిక ప్రశాంతతను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఇద్దరూ కూడా ఆమె మీద స్టింగ్ ఆపరేషన్ జరిపిన జర్నలిస్టులని తెలుస్తోంది. అందుకే ఆమె తన మానసిక ప్రశాంతతను దూరం చేసే విధంగా వారిద్దరు తనను వెంబడిస్తున్నారని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పవిత్ర లోకేష్ గతంలో మైసూరు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరిట కొన్ని నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి కొంత మంది తప్పుడు సమాచారాన్ని ఎక్కువగా వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. 
Also Read: F3 Movie : మాట నిలబెట్టుకున్న దిల్ రాజు.. ఆరోజునే ఎఫ్3 ఓటీటీ రిలీజ్.. ఎందులో, ఎప్పుడు రిలీజంటే?


Also Read: Macherla Niyojakavargam: కాక రేపుతున్న అంజలి.. 'మాచర్ల నియోజకవర్గం'లో రచ్చ చేయడానికి సిద్ధం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook