F3 Movie on Sony Liv: ముందుగా రైటర్ గా కొన్ని సినిమాలకు పనిచేసి పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి అపజయమే ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. కామెడీనే ప్రధాన అంశంగా చేసుకుని సినిమాలు చేసే ఆయన 2019వ సంవత్సరంలో చేసిన ఎఫ్2 సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా సీక్వెల్ వ్యవహారాలు కాస్త ఆలస్యం అయ్యాయి. ఎట్టకేలకు కరోనా సమయంలో షూటింగ్ జరిపిన ఎఫ్ 3 సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ తేజ్, వెంకటేష్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు.
సునీల్, సోనాల్ చౌహన్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఎఫ్ 2 నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మించారు. అయితే సినిమాకి మంచి టాక్ వచ్చినా సరే అప్పటికే విడుదలైన సర్కారు వారి పాట సినిమా ఇంకా చాలా థియేటర్స్ లో రన్ అవుతూ ఉండడం వల్ల కొంత మైనస్ అయింది. ఈ సినిమాకు వారం తరువాత మేజర్ సహా విక్రమ్ సినిమాలు రంగంలోకి దిగడంతో సినిమాకు ఊహించిన మేర వసూళ్లు రాలేదు. కొంతమేర పాజిటివ్ టాక్ తో నష్టాల పాలవకుండా వసూళ్లు రాబట్టిన ఈ సినిమాను ఎట్టకేలకు ఓటిటిలో విడుదల చేసేందుకు నిర్మాతల సిద్ధమయ్యారు.
ఈ ఓటిటి రిలీజ్ విషయంలో దిల్ రాజు మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. దానికి కారణం ఇప్పుడు విడుదలవుతున్న సినిమాల నిర్మాతలు తమ సినిమా ఇప్పట్లో ఓటిటి రిలీజ్ ఉండదని చెబుతూనే సినిమా విడుదలైన నెలలోపే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ దిల్ రోజు మాత్రం ఈ సినిమా విడుదల సమయంలో 8 వారాల తరువాతే డిజిటల్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన విధంగానే ఇప్పుడు సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత సోనీ లివ్ లో ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమా సోనీ లివ్ లో జూలై 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. నిజానికి చాలా మంది డిజిటల్ రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించకపోయినా థియేటర్లలో కలెక్షన్స్ రాని సమయంలో ఓటీటీ నిర్వాహకులు మీ సినిమాకి ముందు ఆఫర్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తామని వారిని టెంప్ట్ చేసి ముందే ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే దిల్ రాజు మాత్రం ఎందుకో ఆ ట్రాప్ లో పడకుండా ప్రకటించిన విధంగానే ఎనిమిది వారాల తరువాత సినిమాని విడుదల చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
Also Read: Macherla Niyojakavargam: కాక రేపుతున్న అంజలి.. 'మాచర్ల నియోజకవర్గం'లో రచ్చ చేయడానికి సిద్ధం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook