Poonam Kaur Tweet on Guntur Kaaram: సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో అంచనాలు భారీగా ఉండే సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా లాంటి సినిమాల తరువాత త్రివిక్రమ్.. మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మహేష్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథని త్రివిక్రమ్ కాపీ కొట్టారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రకారం.. గుంటూరు కారం కథను సులోచనా రాణి నవలలను స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిచ్చారని వార్తలు వస్తున్నాయి. సులోచనా రాణి నవల 'కీర్తి కిరీటాలు' నుంచి 'గుంటూరు కారం' కథాంశాన్ని రూపొందించారని తెలుస్తోంది. అయితే ఇదేమి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కొత్త కాదు. ఇంతకుముందు సులోచన రాణి నవల ‘మీనా’ ఆధారంగా ఆయన అ ఆ సినిమాని తెరకెక్కించారు. అప్పట్లో టైటిల్స్ లో సులోచన రాణి కి క్రెడిట్ ఇవ్వలేదు అని కేసు కూడా ఫైల్ అయింది. ఆ తరువాత కూడా ఇంటిదొంగ చిత్రాన్ని ఆధారంగా తీసుకొని అలా వైకుంఠపురంలో సినిమా తీశారు. పాత కథలను కాపీ కొట్టిన.. వారికి క్రెడిట్ ఇవ్వకుండా త్రివిక్రమ్ ప్రతిసారి తప్పు చేస్తూనే ఉంటారు. మరి నిజంగానే గుంటూరు కాలం నవల ఆధారంగా రూపొందిస్తుంటే ఈసారైనా ఆయన మూల కథకు క్రెడిట్ ఇస్తారా లేదా అనేది సందేహం.


ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పై మండిపడ్డారు హీరోయిన్ పూనమ్ కౌర్. గుంటూరు కారం కాపీ కథ అని ప్రచారం చేసిన వెబ్సైట్ పోస్టుని షేర్ చేస్తూ.. ట్విట్టర్ లో షాకింగ్ కామెంట్స్ చేశారు. త్రివిక్రమ్ ఏమి చేసినా చెల్లుతుంది అని.. ఇక ఆయన్ని గుడ్డిగా కొంతమంది వెనకేసుకుని వస్తారని విమర్శలు చేసింది ఈ హీరోయిన్. అంతేకాదు త్రివిక్రమ్ కి అప్పటి గవర్నమెంటు సపోర్ట్ ఎక్కువ అని.. సాధారణ ప్రజల సమస్యలు తీర్చడానికి లేని గవర్నమెంట్ ఆయనకు మాత్రం బాగా సహాయం చేసింది అని కూడా కామెంట్ చేశారు.


ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.


 




కాగా నాగ వంశీ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించాడు. జగపతి బాబు, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది.


Also read: Japan Earthquake Scary Videos: జపాన్‌లో భారీ భూకంపం, భయపెడుతున్న వీడియోలు


Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook