Actress Poorna Marriage : బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా నటి పూర్ణ ప్రస్తుతం దూసుకుపోతోంది. ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది పూర్ణ. మధ్యలో గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బుల్లితెరపై దుమ్ములేపేస్తోంది. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ ద్వారా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేసినట్టు అయింది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌లో పూర్ణకు మంచి అవకాశాలు వస్తున్నాయి. పెద్ద సినిమాల్లో చాన్సులు వస్తున్నాయి. ఇటు సిల్వర్ స్క్రీన్, అటు స్మాల్ స్క్రీన్‌లో పూర్ణ దుమ్ములేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీహరి హీరోగా వచ్చిన ఈ చిత్రంలో పూర్ణ నటించింది. ఆ తరువాత అల్లరి నరేష్‌తో కలిసి సీమటపాకాయ్ చిత్రంలో నటించింది. అయితే ఈమెకు మాత్రం అవును సినిమాతోనే గుర్తింపు వచ్చింది. అందులో ఆమె కనిపించిన తీరు, బోల్డ్ సీన్స్‌తో ఫేమస్ అయింది. అవును 2లోనూ పూర్ణ నటించి తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.


తెలుగులోనే కాకుండా సౌత్ భాషల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కేరళకుట్టి అయిన ఈ పూర్ణకు తమిళంలోనూ మంచి అవకాశాలు వచ్చాయి. అయితే మధ్యలో పూర్ణ సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత చాలా రోజులకు మళ్లీ బుల్లితెరపై కనిపించింది. ఢీ షోలో కొన్ని రోజులు జడ్జ్‌గా చేసింది. అక్కడ అందరి బుగ్గలు కొరికేస్తూ నానా హంగామా చేసింది.


మధ్యలో కొన్ని రోజులు జబర్దస్త్ షోలోకి వచ్చింది. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీలో సందడి చేస్తోంది. ఆమెకు అఖండ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆమె పెళ్లి వార్తలు, పర్సనల్ లైఫ్‌ మీద రూమర్లు వచ్చాయి. మే నెలలో పూర్ణ తనకు కాబోయే భర్త గురించి చెప్పేసింది. అంతే కాకుండా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.


పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయిందనే రూమర్లు వచ్చాయి. కానీ అసలు విషయాన్ని ఇప్పుడు చెప్పింది పూర్ణ.  ఆల్రెడీ తన పెళ్లి జరిగిపోయినట్టు ప్రకటించేసింది పూర్ణ. ఆసీఫ్ అలీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది.  తమ ఎంగేజ్మెంట్ ఈ ఏడాది మేలో జరిగిందని, జూన్ లో దుబాయ్ వేదికగా తమ పెళ్లి అయ్యిందని అసలు విషయాన్ని ప్రకటించేసింది. 


అయితే వీసాల జారీ కారణంగా తమ పెళ్లికి ఎవ్వరూ రాలేకపోయారని తెలిపింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగినట్టు చెప్పుకొచ్చింది. అయితే త్వరలోనే కేరళలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతోన్నట్టు పూర్ణ చెప్పుకొచ్చింది.


Also Read : Ariyana Bold Photoshoot : బయటకు వస్తున్న అరియానా అందాలు.. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ షో


Also Read : Ginna Day 2 Collections : రెండో రోజు లెక్కలివే.. 'సర్దార్' జోరు.. 'జిన్నా' బేజారు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook