Actress Pragathi: తీన్మార్ స్టెప్పులతో దుమ్ములేపిన ప్రగతి..వీడియో వైరల్
Viral Video: నడిరోడ్డుపై తీన్మార్ స్టెప్పులుతో అదరగొట్టింది ఓ సీనియర్ నటి. చుట్టూ జనాలు ఉన్న హుషారుగా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Actress Pragathi: సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి(Actress Pragathi) టాలీవుడ్(Tollywood)లో మదర్ రోల్స్‌తో గుర్తింపు పొందింది. అయితే సినిమాల్లో నటించి ఎంత పాపులారిటీ సంపాదించిందో..సోషల్ మీడియా(Social Media) ద్వారా అంతకుమించి ఫేమస్ అయింది ఈ నటి. వర్కవుట్ వీడియోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈమె తాజాగా తీన్మార్ స్పెప్టుల(Teenmar Dance)తో అదరగొట్టింది. నడిరోడ్డుపై డప్పు సౌండ్స్‌కి హుషారుగా స్టెప్పులేసింది.
Also read: Viral Video: ఆమె డ్యాన్స్ కు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా..
దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో షేర్‌చేస్తూ..'ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అస్సలు మిస్ కావొద్దు. మీ పిచ్చిని బయటపెట్టాలి' అంటూ వీడియోనే షేర్ చేసింది.ప్రగతి డ్యాన్స్(Pragathi Dance Video) చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 44 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉంటూ ఇలా తీన్మార్ స్టెప్పులతో ఇరగదీశారు అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. లుంగీ డాన్స్, కిక్ బాక్సింగ్, క్లాసికల్ డాన్స్, తీన్మార్ స్టెప్స్ ఇలా ఏ రకమైన దాంట్లో అయినా తనకు తానే సాటి అంటూ ఇలా ఎంజాయ్ చేస్తోంది ఈ సీనియర్ నటి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook