Viral Video: బన్నీని దించేసింది...డీజే స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది..

Viral Video:  స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ చేసిన సాంగ్ ను అచ్చుగుద్దినట్లు దించేసింది ఓ అమ్మాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాల్  చల్ చేస్తోంది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 12:37 PM IST
Viral Video: బన్నీని దించేసింది...డీజే స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది..

Viral Video:  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరోకు బయట ఎంతో ఫాలోయింగ్ ఉందో..సోషల్ మీడియాలోనూ అంతే క్రేజ్ ఉంది. బన్నీ వీడియోలు అనుకరిస్తూ..చాలా మంది అభిమానులు, నెటిజన్లు తమదైన స్టైల్ లో రిక్రియేట్ చేస్తూ..సోషల్ మీడియా(Social Media)లో పోస్టులు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియో బన్నీ అభిమానుల(Bunny Fans)ను  తెగ ఆకట్టుకుంటోంది. 

Also Read:Aditi Rao Hydari photos gallery: సంప్రదాయమైన దుస్తుల్లోనే అందంగా మెరిసిపోతున్న అదితి రావ్ హైదరి ఫోటో గ్యాలరీ

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటించిన చిత్రం ‘డీజే (దువ్వాడ జగన్నాథం)’. ఇందులోని ‘గుడిలో బడిలో మదిలో’ అనే పాటకు బన్నీ, పూజ వేసిన స్టెప్పులు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ పాటను అనుకరిస్తూ ఎంతోమంది డ్యాన్స్ వీడియో(Dance Videos)లు షేర్‌ చేశారు. వీటికి సోషల్‌ మీడియాలో కూడా భారీ స్పందన వచ్చింది. ఈ క్రమంలో మృణాలి కిరణ్‌(Mrinali Kiran) అనే ఓ అమ్మాయి కూడా ‘గుడిలో బడిలో మదిలో’ పాటకు అద్భుతంగా కాలు కదిపింది. పాటలో అల్లు అర్జున్‌ కనిపించిన తరహాలోనే ముస్తాబై కుర్చీలో కూర్చొని డ్యాన్స్‌ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు ఆమె ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బన్నీని దించేశావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News