Renu Desai: మరలా కెమెరా ముందుకొస్తున్నా.. ఆశీర్వదించండి
తెలుగు సినీ పరిశ్రమలో నటి రేణు దేశాయ్ (Renu Desai) ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు తెలుగు ప్రక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న రేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని ( Pawan Kalyan ) ప్రేమించి పెళ్లి చేసుకోని.. విడిపోయినా తర్వాత కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతంచేసుకున్నారు.
Actress Renu Desai Acting in Web Series: తెలుగు సినీ పరిశ్రమలో నటి రేణు దేశాయ్ (Renu Desai) ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు తెలుగు ప్రక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న రేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ను ప్రేమించి పెళ్లి చేసుకోని.. విడిపోయినా తర్వాత కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతంచేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలు పలు సనిమాలకు దర్శకురాలిగా మారి రేణు దేశాయ్ పేరు ప్రఖ్యాతలను సొంతంచేసుకున్నారు. అప్పుడెప్పుడో బద్రీ, జానీ సినిమాల్లో నటించిన రేణు దేశాయ్.. మళ్లీ నటిస్తే బాగని ఆమె అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారందరికీ ఆమె గుడ్ న్యూస్ చెప్పారు. మరోసారి కెమెరా ముందుకు రాబోతున్నానని.. ఆశీర్వదించాలని కోరారు రేణు దేశాయ్. వెబ్ సిరీస్ ( Web Series) లో నటిస్తున్న విషయాన్ని శనివారం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా వెల్లడిస్తూ.. బ్లాక్ అండ్ వైట్‌లో ఉండే ఓ ఫొటోను దానికి జతచేశారు. Also read: Renu Desai direction: తెలుగు సినిమా డైరెక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన రేణు దేశాయ్
మరోసారి కెమెరా ముందుకు రాబోతున్నా.. ఓ అద్భుతమైన వెబ్‌సిరీస్‌కి సంతకం చేశానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. దీని షూటింగ్ వచ్చెనెల నుంచి ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తా... వాస్తవాలను తెలుసుకోవాలని అణ్వేశించే మహిళ పాత్రలో నటిస్తున్న తనకు మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ఆమె కోరారు. ఈ వెబ్ సిరీస్‌కి ఎమ్‌ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తుండగా.. డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్నారు. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. Also read: Agriculture bills: వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం