Sameera Reddy Interview: తెలుగులో నటించింది మూడు సినిమాలే అయినా.. టాప్ హీరోయిన్‌ రేంజ్‌ను సొంతం చేసుకుంది నటి సమీరా రెడ్డి. నరసింహుడు, అశోక్, జై చిరంజీవ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తరువాత 2014లో వ్యాపార వేత్త అక్షయ్ వార్డెను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌ బై చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా రెడ్డి.. పెళ్లి, పిల్లలు, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014లో తమ ఇంటి టెర్రస్‌పైనే అక్షయ్‌తో తన పెళ్లి చాలా సింపుల్‌గా జరిగిందని తెలిపారు సమీరా రెడ్డి. తాను గర్భవతి అయ్యానని.. అందుకే హడావుడిగా పెళ్లి చేసుకున్నానని కొందరు పుకార్లు సృష్టించారని.. అలా ఎందుకు పుట్టించారో తనకు అర్థం కాలేదన్నారు. రెండు కుటుంబాల పెద్ద అంగీకారంతోనే తమ పెళ్లి జరిగిందని చెప్పారు. 


ఫస్ట్‌ ప్రెగ్నెన్సీ సమయంలో తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చారు. 2015లో బాబు పుట్టిన తర్వాత బరువు బాగా పెరగడంతో శరీరంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. బరువు పెరగడంతో చుట్టు పక్కల వాళ్లు కామెంట్స్ చేశారని.. చివరికి కురగాయలు అమ్మే వ్యక్తి కూడా అన్నాడని గుర్తు చేసుకున్నారు. ఈ విమర్శలు తనను ఎంతో భయపెట్టాయని.. ఫొటోగ్రాఫర్స్‌కు కనిపించకూడదని.. కొంతకాలం బయటకు రాలేకపోయానని చెప్పారు. 


ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉన్న తాను.. తిరిగి ఫ్యాన్స్‌తో కనెక్ట్‌ కావాలనుకున్నానని సమీరా రెడ్డి తెలిపారు. సోషల్‌మీడియా ద్వారా ముచ్చటిద్దామని ఇన్‌స్టాలో అకౌంట్‌ క్రియేట్ చేసినట్లు చెప్పారు.‌ తన అకౌంట్‌ను కాస్త ప్రమోట్‌ చేయాలని ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేస్తే ఒక్కరు కూడా తనకు సాయం చేయలేదన్నారు. తనకు బాధగా అనిపించిందని చెప్పుకొచ్చారు.  


Also Read: WI vs IND Dream11 Team Tips: సిరీస్ విజయంపై భారత్ కన్ను.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..   


Also Read: Telangana Politics: బీజేపీకి బిక్ షాక్.. కీలక నేత గుడ్‌బై  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి