Former Minister A Chandrasekhar Resigns To BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతోంది. అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ అందరి కంటే ముందు అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 90 మంది అభ్యర్థులతో గులాబీ బాస్ మొదటి జాబితాను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 80 శాతం సిట్టింగ్‌లకే టికెట్లు కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ప్రతిక్షాలు ఆచితూచి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అధికార పార్టీలో టికెట్లు దక్కని నేతలను తమ వైపు ఆకర్షించి.. టికెట్లు ఇచ్చే యోచన చేయనున్నాయి. ఇక అభ్యర్థుల ప్రకటనకు ముందే ఆ పార్టీలోని నాయకులు ఇటు.. ఈ పార్టీలోని నాయకులు అటు జంప్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి తాజాగా షాక్ తగిలింది. కీలక నేత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖ్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. 30 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ప్రజల మేలు కోసం.. ప్రజల అభీష్టం మేరకు మాత్రమే రాజకీయాల్లో ఉంటున్నానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం 12 ఏళ్లు పనిచేశానని.. ఆ క్రమంలో మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ యువకులకు ఉద్యోగాలు, రైతుల పొలాలకు నీళ్లు వస్తాయనుకుంటే.. అది కలగానే మిగిలిపోయిందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్ని తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం చాలా బాధకరంగా ఉందని అన్నారు చంద్రశేఖర్. తప్పనిపరిస్థితుల్లో బీజేపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే నాయకులను ప్రోత్సహించకపోవడం శోచనీయమన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ నెల 18న ఢిల్లీలో హస్తం గూటికి చేరనున్నారు.
1985లో తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటికల్ కెరీర్ ఆరంభించి.. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989, 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001లో టీడీపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్‌లో చేరారు. 2004లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. అప్పటి కూటమిలో భాగంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవిని పొందారు. అనంతరం 2008లో తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2008 ఉప ఎన్నికలు, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2014లో పోటీకి దూరంగా ఉండగా.. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి 2021లో బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీకి గుడ్‌బై చెప్పి.. తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Also Read: TSPSC Group-2 exam: గ్రూప్-2 పరీక్ష నవంబరుకు వాయిదా
Also Read: IND vs WI: చితక్కొట్టిన టీమ్ ఇండియా, నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి