Shweta Tiwari Controversial Comments: హిందీ నటి శ్వేతా తివారీ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'షో స్టాపర్' ప్రమోషన్‌లో భాగంగా భోపాల్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తివారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. తన లోదుస్తుల గురించి మాట్లాడుతూ దేవుడిని ఉద్దేశించి ఆమె అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. తివారీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా విచారణకు ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రెస్‌మీట్‌లో శ్వేతా తివారీ మాట్లాడుతూ.. తన లోదుస్తుల గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగా దేవుడి ప్రస్తావన తీసుకొచ్చారు. 'దేవుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు..' అంటూ ఆమె వ్యాఖ్యానించారు. శ్వేతా తివారీ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆమె తోటి నటీనటులు రోహిత్ రాయ్, సూర్యవంశీ, సౌరభ్ రాజ్ కూడా పక్కనే ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


శ్వేతా తివారీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ అయ్యారు. 'శ్వేతా తివారీ చేసిన వ్యాఖ్యలు నేను విన్నాను... ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను..' అని పేర్కొన్నారు. తివారీ వ్యాఖ్యలపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా భోపాల్ పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా శ్వేతా తివారీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామన్నారు.


శ్వేతా తివారీ హిందీలో 'మహాభారత', 'కసౌతి జిందగీ కయ్', 'జలక్ దిక్లాజా' బిగ్‌బాస్ (Bigg Boss) వంటి సీరియల్స్, రియాలిటీ షోలతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె 'షో స్టాపర్' వెబ్ సిరీస్‌లో 'బ్రా ఫిట్టర్' పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ ఓటీటీలో విడుదల కానుండటంతో ప్రస్తుతం షో స్టాపర్ టీమ్ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. 


Also Read: Video: గ్యాంగ్ రేప్ బాధితురాలిపై అమానుషం.. గుండు గీసి వీధుల్లో ఊరేగించిన మహిళలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook