Gang Rape Survivor attacked by women in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో అమానుషం చోటు చేసుకుంది. ఓ అత్యాచార బాధితురాలి పట్ల స్థానికులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. ఆమెకు గుండు గీసి.. ముఖానికి నలుపు రంగు పులిమి.. మెడలో చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించారు. తోటి మహిళలే ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. పైగా ఆ సమయంలో... అదేదో వినోదం లాగా చప్పట్లు, కేరింతలతో ఆ తతంగాన్ని వారు ఆస్వాదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆ యువతి పట్ల అమానుషంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలిని కలిసి వివరాలు సేకరించిన ఆమె ట్విట్టర్ ద్వారా ఆ విషయాలు వెల్లడించారు. కస్తూర్బా నగర్‌కి చెందిన 20 ఏళ్ల ఆ యువతిపై అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడినట్లు తెలిపారు. ఇంట్లో నుంచి యువతిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
అత్యాచార సమయంలో స్థానిక మహిళలు కొందరు నిందితులను మరింత రెచ్చగొట్టారని చెప్పారు. అత్యాచారం తర్వాత యువతిపై దాడి చేశారని.. గుండు గీసి, ముఖానికి నలుపు రంగు పులిమి, మెడలో చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించారని తెలిపారు. యువతిపై దాడికి పాల్పడినవారందరినీ అరెస్ట్ చేయాలని పోలీసులను స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు. అదే సమయంలో బాధిత యువతికి, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. 72 గంటల్లోగా ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
ఈ ఘటనపై బాధితురాలి సోదరి మాట్లాడుతూ.. గతేడాది నవంబర్‌లో స్థానిక యువకుడు ఒకరు ఆత్మహత్యకు (Suicide Case) పాల్పడినట్లు తెలిపారు. తన సోదరితో ప్రేమ కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపించారన్నారు. ఆ కారణంగానే తన సోదరిపై దాడి జరిగి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని... నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3
— Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022
Also Read: Budget 2022: ఇప్పటివరకూ అత్యధిక సమయం పాటు బడ్జెట్ స్పీచ్ ఇచ్చినదెవరో తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook