Casting Couch: సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశం మలయాళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై తీవ్ర రచ్చ జరుగుతోంది. అవకాశాల కోసం నిర్మాతలు.. నటులు వేధింపులకు పాల్పడుతున్న అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీ వేసి విచారణ చేపట్టింది. ప్రభుత్వం స్పందించడంతో బాధితులు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. తాజాగా మరో సీనియర్‌ నటి తనపై జరిగిన ఘోర విషయాలను చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. ఓ మీడియాతో ఆమె ఒక సైకోలా ప్రవర్తించి తన ప్రైవేటు భాగాల వద్ద అమానుషంగా ప్రవర్తించాడని వివరించారు. ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి కేరళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sai Pallavi: చెల్లె పెళ్లిలో దుమ్ము రేపిన సాయి పల్లవి.. కిర్రాక్ డ్యాన్స్‌తో హైబ్రిడ్‌ పిల్ల 'ఫిదా'


 


తనపై జరిగిన అమానుష దాడి.. దర్శకుడు చేసిన శారీరక వేధింపులపై అలనాటి సినీ హీరోయిన్‌ సౌమ్య సంచలన విషయాలు వెల్లడించారు. తాను హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన సమయంలో ఓ దర్శకుడు వ్యవహరించిన తీరును వివరించారు. 'అతడి శునకానందం కోసం నా ప్రైవేటు పార్టులో రాడ్డు పెట్టేవాడు. అతడు నన్ను శారీరకంగా.. మానసికంగా వేధింపులకు గురి చేశారు' అని సౌమ్య చెప్పారు. అయితే ఆమె దర్శకుడి పేరును మాత్రం వెల్లడించలేదు.


Also Read: Double ismart Movie: సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్


 


హేమ కమిటీ లాంటివి ఏర్పడితే వారి ముందు దర్శకుడి పేరు వెల్లడిస్తానని నాటి హీరోయిన్‌ సౌమ్య తెలిపారు. 'నా కెరీర్‌ ప్రారంభంలో ఓ సినిమా చేశా. అయితే ఆ సినిమాను మహిళ దర్శకురాలు చేశారు. అయితే పేరు ఆమెది కానీ దర్శకత్వం వహించింది మాత్రం ఆమె భర్త. చిన్న వయసు (18 ఏళ్లు) కాబట్టి నన్ను వాళ్లింటికి తీసుకెళ్లేవారు. లైంగికంగా ఎలా కావాలంటే అలా వేధించేవారు. అతడి ఆనందం కోసం ప్రైవేటు పార్టుల్లో రాడ్లు పెట్టేవారు' అని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు.


'సినిమా అవకాశం వచ్చినప్పుడు నా వయసు 18 ఏళ్లు. కాలేజీకి వెళ్తున్నానని చెప్పినా కూడా హీరోయిన్‌ అవకాశం ఇస్తానని చెప్పడంతో ఇంట్లో వాళ్లు అంగీకరించారు. నా తల్లిదండ్రులకు సినీ పరిశ్రమ గురించి పూర్తిగా తెలియదు. మా ఇంటికి సమీపంలోనే నటి రేవతిని చూసి స్ఫూర్తి పొందా. సినీ పరిశ్రమలోకి వెళ్లి ఆమెలా గుర్తింపు లభిస్తుందని వచ్చా. అయితే నాపై లైంగిక దాడికి పాల్పడిన దర్శకుడే తన సొంత కుమార్తెపై కూడా అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఆ వివాదాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేసుకున్నారు' అని సౌమ్య వాపోయారు.


తన నిస్సహాయత.. అమాయకత్వంతో నన్ను ఓ శృంగారానికి బానిసగా చేసుకునేలా ప్రయత్నం చేశాడు. ఎంత ఆలస్యమైనా అతడి లైంగిక వేధింపులు, లీలలు చెప్పాలని నోరెత్తాను. నాలాంటి బాధితులు చాలా ఉంటారు. వారంతా కూడా నోరు విప్పాలి' అని నటి సౌమ్య పిలుపునిచ్చారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter