Sai Pallavi: చెల్లె పెళ్లిలో దుమ్ము రేపిన సాయి పల్లవి.. కిర్రాక్ డ్యాన్స్‌తో హైబ్రిడ్‌ పిల్ల 'ఫిదా'

Sai Pallavi Steals With Dance And Apperance In Traditional Saree: చెల్లెలి పెళ్లిలో సాయిపల్లవి తన డ్యాన్స్‌.. వీడియోలతో హల్‌చల్‌ చేశారు. ఆమె డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 5, 2024, 06:09 PM IST
Sai Pallavi: చెల్లె పెళ్లిలో దుమ్ము రేపిన సాయి పల్లవి.. కిర్రాక్ డ్యాన్స్‌తో హైబ్రిడ్‌ పిల్ల 'ఫిదా'

 Sai Pallavi Dance Viral: అందం.. నటనతోపాటు డ్యాన్స్‌లతో అదరగొట్టి హీరోలకు గట్టి పోటీనిచ్చే హీరోయిన్‌ సాయి పల్లవి. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా సినిమాలకు వెళ్లే అభిమానులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె డ్యాన్స్‌ ఎంత బాగుంటుందో. మరి అలాంటి సాయిపల్లవి తన సోదరి పెళ్లి అయితే ఊకుంటదా మరి? కొన్ని నెలల కిందట జరిగిన నిశ్చితార్థం వేడుకలోనే దుమ్ము దులిపిన హైబ్రిడ్‌ పిల్ల ఇప్పుడు పెళ్లి మరింత సందడి చేసింది. బంధుమిత్రులతో పలకరింపులు.. అల్లరి పనులతోపాటు డ్యాన్స్‌లతో మన సాయిపల్లవి రచ్చ చేసింది. దానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Double ismart Movie: సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్

దక్షిణాది సినిమాల్లో టాప్‌ హీరోయిన్‌గా ఉన్న సాయి పల్లవి ప్రస్తుతం చెల్లెలి పెళ్లి పనుల్లో మునిగితేలింది. సాయికి పూజా కన్నన్‌ అనే చెల్లెలి ఉంది. పూజ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని సినిమాలు కూడా చేసింది. పూజా కన్నన్‌ తన స్నేహితుడు వినీత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గురువారం పూజ, వినీత్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కేరళలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఈ వివాహం జరిగిందని సమాచారం. బంధుమిత్రులు, మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది.

Also Read: Fish Venkat: ఆర్ధిక ఇబ్బందులో నటుడు ఫిష్ వెంకట్.. సాయం అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు..

అయితే పెళ్లికి ముందు హల్దీ, మెహందీ ఫంక్షన్‌, సంగీత్‌ వేడుకల్లో సాయి, పూజా ఇద్దరూ హల్‌చల్‌ చేశారు. ఆటలు పాటలతో వివాహ ప్రాంగణంలో హోరెత్తించారు. అక్కాచెల్లెలు ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. సంగీత్‌ వేడుకలో వీరిద్దరూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పెళ్లి వేడుకల్లో వీరిద్దరిదే హవా నడిచింది. హిందీ, మలయాళీ, తెలుగు పాటలకు అక్కాచెల్లెళ్లు డ్యాన్స్‌లతో అదరగొట్టారు. చెల్లి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాయి పల్లవి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే డ్యాన్స్‌ చేస్తున్న క్రమంలో సాయి పల్లవి తడబడ్డారు. డ్యాన్స్‌ చేస్తుండగా సాయి పల్లవి కాలు జారింది. అయితే వెంటనే సర్దుబాటు చేసుకుని చెల్లెలితో కలిసి డ్యాన్స్‌ను కొనసాగించింది. ఈ వీడియో మరింత ప్రత్యేకంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News