Actress Sudha Says She Lost Crores of Rupees in Business: తెలుగులో అమ్మగా, వదినగా, అత్తగా అనేక వందల సినిమాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అనేక సినిమాల్లో హీరోలకు అమ్మగా హీరోయిన్లకు అమ్మగా నటించి ఆమె అలరించారు. అయితే తెలుగు వారే అయినా తమిళనాడులోని శ్రీ రంగంలో జన్మించిన సుధా ముందుగా హీరోయిన్ అవ్వాలని ఆరాటపడ్డారు. అయితే నీ ముఖ కవళికలు హీరోయిన్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండగలవు అంటూ డైరెక్టర్ బాలచందర్ సూచించడంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ముందుగా ఆమె డబ్బింగ్ విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు కానీ అల్లు రామలింగయ్య సలహాతో తెలుగు నేర్చుకోవడం మీద శ్రద్ధ పెట్టి సొంతంగా డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టడంతో ఆమెకు అవకాశాలు పెరిగి చాలా బిజీ అయిపోయారు. డబ్బు కూడా ఆమె గట్టిగానే సంపాదించినా తర్వాత ఆమె చేసిన వ్యాపారాల వల్ల ఆర్థికంగా చితికి పోయారు.


ఆమె నమ్మిన వాళ్లు కూడా కొంతమంది మోసం చేయడంతో భారీగా నష్టపోయారట, అలాంటి సమయంలో భర్త కూడా ఆమెకు అండగా నిలబడకుండా వదిలేసి ఫారెన్ వెళ్ళిపోయాడని తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. కుమారుడు ఒక విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అతనితో కూడా సుధ మాట్లాడటం లేదట. కనీసం ఫోన్ లో అయినా మాట్లాడడని పేరుకు కొడుకే కానీ ఎక్కడో ఎవరితోనో సెటిలైపోయాడని చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు.


చిన్నప్పటి నుంచే తాను బార్న్ విత్ డైమండ్ స్పూన్ అని పేర్కొన్న ఆమె ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబంలోనే జన్మించాను, నేను కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించానని అన్నారు. వందల కోట్లు సంపాదించాను కానీ ఢిల్లీలో హోటల్ ప్రారంభించడం వల్ల ఆ డబ్బంతా నష్టపోయానని ఆమె పేర్కొన్నారు. దేవుడు మనం ఏం చేయాలో ముందే నిర్ణయిస్తాడని అందుకే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం మానేశానని సుధ పేర్కొన్నారు ఉన్నదాంట్లో సంతృప్తి పడటమే తనకు బాగా అలవాటైపోయింది అంటూ సుధ ఎమోషనల్ అయ్యారు. 


Also Read: Tunisha Sharma Death: బెయిల్ ఇవ్వవని కోర్టు.. నేను ముస్లింని కాకపోతే ఇదంతా జరిగేది కాదన్న షీజన్ ఖాన్!


Also Read: Shaakuntalam: శాకుంతలం ఒరిజినల్ పాన్ ఇండియా మూవీ అయితే ఆర్సీ 15 ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook