Shaakuntalam: శాకుంతలం ఒరిజినల్ పాన్ ఇండియా మూవీ అయితే ఆర్సీ 15 ఏంటి?

Dil Raju Comments on Shakunthalam: శాకుంతలం సినిమా తమ బ్యానర్ నుంచి వచ్చే ఒరిజినల్ పాన్ ఇండియా మూవీ అని కామెంట్ చేయడంతో కొందరు రామ్ చరణ్ అభిమానులు అలా ఎలా కామెంట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 9, 2023, 07:11 PM IST
Shaakuntalam: శాకుంతలం ఒరిజినల్ పాన్ ఇండియా మూవీ అయితే ఆర్సీ 15 ఏంటి?

Dil Raju Comments on Shakunthalam Goes Viral: సమంత హీరోయిన్ గా శాకుంతలం అనే సినిమా తెరకెక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటించగా దుష్యంతుడు అనే పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. శకుంతలా దుష్యంతుల ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా ఆయన సొంతంగా గుణ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించారు.

ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ముందుకు రావడంతో ఒకరకంగా ఇది దిల్ రాజు సినిమా అయిపోయింది. ఈ సినిమాను వచ్చే నెల 17వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే అనేక రకాల పోస్టర్లు విడుదల చేయగా ఈరోజు సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ గుణశేఖర్ మూడేళ్ల కష్టం ఈ 'శాకుంతలం' అని, ఈ సినిమా కోసం ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది తనకు తెలుసని అన్నారు.

సమంత కథ వినగానే ఓకే అన్నారు కానీ విజువలైజేషన్ కి కొంత సమయం పట్టిందని స్క్రీన్ పై చూసిన తరువాత ఆమె హ్యాపీగా ఫీలైందని అన్నారు. డైరెక్టర్ ఏం చెప్పారో అదే తీశారని నాకు కాల్ చేసిందని అన్నారు. ఈ సినిమాలో సమంత ఎమోషనల్ జర్నీ బ్యూటిఫుల్ గా ఉంటుందని అలాగే 'బాల భరతుడు' పాత్రను ఎవరితో చేయించాలని అనుకుంటుంటే గుణశేఖర్ బన్నీ దగ్గరికి వెళ్లి 'అర్హ' నటించేలా పర్మిషన్ తీసుకొచ్చారని అన్నారు.

అంతేకాదు నేను 'వారసుడు'.. చరణ్ - శంకర్ లతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా ఐదు లాంగ్వేజెస్ లో చేసిన ఒరిజినల్ పాన్ ఇండియా సినిమా ఇదని దిల్ రాజు కామెంట్ చేయడమే కాక అలా చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉందని అన్నారు. అయితే దిల్ రాజు మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కానీ రామ్ చరణ్ అభిమానులకు దిల్ రాజు మాటలు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15వ సినిమా రూపొందుతోంది.

దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సమంత నటించిన శాకుంతలం సినిమా ఒరిజినల్ పాన్ ఇండియా మూవీ అని దిల్ రాజు అనడం వారికి ఏ మాత్రం రుచించడం లేదు. అసలు దిల్ రాజు అలా ఎలా మాట్లాడుతారు అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 

Also Read: Slums Caught Fire: భీకర అగ్నిప్రమాదం.. 200 ఇళ్లు దగ్ధం.. ఆర్పుతున్న కొద్దీ అలానే!

Also Read: Tunisha Sharma Death: బెయిల్ ఇవ్వవని కోర్టు.. నేను ముస్లింని కాకపోతే ఇదంతా జరిగేది కాదన్న షీజన్ ఖాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News