Actress Tabu Injured On Ajay Devgn Bhola Movie Set: సినిమా షూటింగ్స్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి నటీనటులు అనూహ్యంగా గాయపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలా చాలా మంది నటీనటులు గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇక తాజాగా బుధవారం 'భోలా' సినిమా సెట్స్‌లో నటి టబు తీవ్రంగా గాయపడింది. అజయ్ దేవగన్ హీరోగా నటిసున్న 'భోలా' సినిమాలో టబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఆమె ఒక ఫైట్ సీన్ కోసం స్టెంట్ చేస్తూ ఉండగా గాయపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టబు నుదుటిపై అలాగే కంటి పైన గాయమైందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోందని అంటున్నారు. షూటింగ్ సమయంలో టబు ఒక దట్టమైన అడవిలో ట్రక్కును నడుపుతోంది. అదే సమయంలో మోటార్‌సైకిల్‌పై కొందరు దుండగులు ఆ ట్రక్కును వెంబడిస్తూ ఉంటారు. సినిమా షూటింగ్‌లో భాగంగానే ఇది జరుగుతూ ఉండగానే ఆ ట్రక్కును వెంబడిస్తున్న బైక్‌లలో ఒకటి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. అలా ఢీ కొన్న సమయంలో ఒక గాజు ముక్క పగిలి టబును తాకింది.


ఆ సమయంలో టబు ట్రక్కులో ఉందని అంటున్నారు. టబు కుడి కన్ను పైన ఒక గాజు ముక్క తగిలిందని ఘటనా స్థలంలో ఉన్నవారు చెప్పినట్టు తెలుస్తోంది. టబు కుడి కన్ను పైన ఆ గాజు ముక్క కోసుకుపోయిందని, అక్కడి నుంచి రక్తం కారుతోంది కానీ అదృష్టవశాత్తూ, కుడి కనుబొమ్మ పైన గాయం అయింది, అదే కంటికి తగిలి ఉంటే అది పెనుప్రమాదం అయి ఉండేదని అంటున్నారు.  


సెట్లో అందుబాటులో ఉన్న వైద్య సహాయంతో ఆమె సెట్ అయ్యారని, ఆ గాయం చిన్నది, దానికి కుట్లు అవసరం లేదని అంటున్నారు. అయితే ఆమె తనంతట తానుగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవడానికి అజయ్ ఒక ఆమెకు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక 'భోలా' కంటే ముందు, నటి టబు 'దృశ్యం' సినిమాలో ఒక ఒక పోలీసు అధికారి పాత్రలో కనిపించింది. తెలుగు సహా దక్షిణాది భాషల్లో సత్తా చాటిన టబు ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లో కూడా తన మార్క్ చూపుతోంది. 


Also Read: Shilpa Shetty: షూటింగ్లో ప్రమాదం.. కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి!


Also Read: Laal Singh Chaddha: నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.