Yami Gautam gets married to Aditya Dhar: గతేడాది లాక్‌డౌన్ సమయంలోనే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోగా ఈ ఏడాది లాక్‌డౌన్‌లో ఇటీవలే ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే కోవలో తాజాగా యామీ గౌతం కూడా చేరిపోయింది. అవును యామీ గౌతం పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్‌తో శుక్రవారం అతి కొద్ది మంది సమీప బంధుమిత్రుల సమక్షంలో యామీ గౌతం పెళ్లి వేడుక పూర్తయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమీప బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని, ఇక మీ ఆశీస్సులు కావాలని కోరుతూ యామీ గౌతం సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటో (Yami Gautam wedding photos) పోస్ట్ పెట్టే వరకు ఆమె పెళ్లి గురించి చాలా మందికి తెలియలేదు. 



 


జమ్మూకశ్మీర్‌లోని యురి మిలిటరీ స్థావరంపై పాకిస్థాన్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ (Surgical strikes) బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన 'యురి: ద సర్జికల్ స్ట్రైక్' సినిమాను తెరకెక్కించిన దర్శకుడే ఈ ఆదిత్య ధర్. అంతకంటే ముందుగా కాబుల్ ఎక్స్‌ప్రెస్, హాల్ ఏ దిల్, వన్ టూ త్రీ, డాడీ కూల్ వంటి చిత్రాలకు లిరిక్స్ అందించాడు. 


ఆక్రోష్, తేజ్ చిత్రాలకు డైలాగ్స్ రాసిన ఆదిత్య ధర్ తొలిసారిగా డైరెక్టర్‌గా మారి యురి: ద సర్జికల్ స్ట్రైక్ మూవీని (Uri: The Surgical Strike) తెరకెక్కించాడు. దేశ భక్తి నేపథ్యంతో తెరకెక్కిన సినిమా కావడంతో చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి ఆధరణ లభించింది. 


ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో యామీ గౌతం కూడా ఓ కీలక పాత్ర పోషించింది. అండర్‌కవర్ ఆపరేషన్స్‌లో పాల్గొనే రా ఏజెంట్ పాత్రలో యామీ గౌతం (Actress Yami Gautam) నటించింది.