Adi Saikumar: ఆది సాయికుమార్ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అంతేకాదు ఈయన సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘షణ్ముఖ’ చిత్ర షూటింగ్ కంప్లీటైంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరగుతోంది. ఈ సినిమాను భక్లి మరియు థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు.  పేరుతోనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్  హీరోగా నటించారు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘శాస‌న‌స‌భ’ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన చివ‌రి షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది.


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మ‌ట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.  రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్టు చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఈ చిత్రం కోసం ఎంతో రిచ్‌గా వేసిన ఓ సెట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను పూర్తిచేసినట్టు చెప్పుకొచ్చారు.  కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బ‌సూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


ప్రస్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మాణనంత‌ర ప‌నులు జరగుతున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో డిఫరెంట్ చిత్రంగా  నిలిచిపోతుందన్నారు.


Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter