Adipurush Movie: ఆదిపురుష్ సినిమా కలెక్షన్ల సంగతేమో గానీ వివాదాలు మాత్రం వెంటాడుతున్నాయి. వివాదం ఏ స్థాయికి వెళ్లిందంటే..ఆ సినిమా డైలాగ్స్ రాసిన రచయిత మనోజ్ ముంతషిర్ శుక్లా ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. రక్షణ కల్పించాల్సిందిగా ముంబై పోలీసుల్ని కోరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు కలెక్షన్లు కురిపిస్తోంది. సినిమా డిజాస్టరా లేక బ్లాక్ బస్టర్ హిట్టా అనేది పక్కనబెడితే సినిమా చుట్టూ రేగిన వివాదాలు మాత్రం ఇప్పట్లో సమసిపోయేలా కన్పించడం లేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా హిందూవుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయనేది ప్రధానమైన ఆరోపణ. అందుకే సినిమా రచయిత మనోజ్ ముంతషిర్ శుక్లాకు బెదిరింపులు వస్తున్నాయి. పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినిమాలో హనుమంతుడికై ఆయన రాసిన డైలాగ్స్ కొంతమందికి అభ్యంతరకరంగా ఉన్నాయి. వివాదం రోజురోజుకూ పెరుగుతుండటంతో చిత్ర యూనిట్ డైలాగ్స్ మార్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రచయిత మనోజ్ శుక్లా ప్రాణ హాని ఉందంటూ ముంబై పోలీసుల్ని ఆశ్రయించారు. ఆదిపురుష్ సినిమాపై రేగుతున్న వివాదం నేపధ్యంలో తనకు మప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించమని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. 


మనోజ్ ముంతషిర్ శుక్లా ప్రముఖ రచయిత. ఆదిపురుష్ సినిమా డైలాగ్స్ విషయంలో చాలామంది ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. కొంతమందైతే చంపేస్తామని బెదిరించినట్టు తెలుస్తోంది. అందుకే మనోజ్ శుక్రా రక్షణ కల్పించాల్సిందిగా ముంబై పోలీసుల్ని కోరారు. సోషల్ మీడియాతో పాటు మెయిల్స్ రూపంలో కూడా బెదిరింపులు వస్తున్నాయని మనోజ్ శుక్లా వివరించారు. తనపై ఎక్కడైనా ఎప్పుడైనా దాడి జరగవచ్చని ఆయన భయపడుతున్నారు. ముంబై పోలీసు కమీషనరేట్ జోన్ 9 కు ఆయన ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని తెలిపారు. ఆదిపురుష్‌లో అభ్యంతరకర డైలాగ్స్ రాయడం, రామాయణాన్ని అగౌరవపర్చడం చేశారనే కారణంగా రాజకీయ నేతలు, ప్రేక్షకులు రచయిత మనోజ్ శుక్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ సినిమాపై వివాదం నేపధ్యంలో రచయిత మనోజ్ శుక్లా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. ముందూ వెనుకా ఆలోచించకుండానే డైలాగ్స్ రాస్తారా అనే ప్రశ్నకు ఇదంతా టీమ్ వర్క్ అని, దర్శకుడు ఓమ్ రౌత్‌పై పూర్తిగా నమ్మకం పెట్టానని బదులిచ్చారు. ఓ వైపు వివాదం రోజురోజుకూ పెద్దదవుతున్నా రచయిత మనోజ్ శుక్లా మాత్రం క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదనడం విశేషం. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర, కృతి సనన్ సీత పాత్రను పోషించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కన్పించారు. ప్రస్తుతం రికార్డు స్థాయి కలెక్షన్లు కురిపిస్తోంది ఈ సినిమా. 


Also read: Anchor Sreemukhi: ఏంటండీ శ్రీముఖి.. ఈ డ్రెస్‌లో మరి ఇంత అందంగా ఉన్నారు..! లేటెస్ట్ పిక్స్ చూశారా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook