Aditi Rao Hydari – Siddharth Networth


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


హీరో సిద్ధార్థ్ గత కొద్దికాలంగా తాను డేటింగ్ చేస్తున్న హీరోయిన్ అదితి రావ్ ను పెళ్లి చేసుకున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. గత మూడు రోజులుగా వీళ్ళ పెళ్లి గురించి భారీ ఎత్తున చర్చ జరిగింది. తెలంగాణలోని వనపర్తి  ఆలయంలో వీరిద్దరి పెళ్లి  జరిగింది అన్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వీటిపై స్పందించిన ఈ జంట.. జరిగింది పెళ్లి కాదు నిశ్చితార్థం అని చెప్పి అందరికి క్లారిటీ ఇచ్చారు. “ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్” అని సిద్ధార్థ పోస్ట్ చేయగా..సిద్ధార్థ తో కలిసి దిగిన ఫోటోలతో పాటు అతడు ఎస్ చెప్పాడు.. ఎంగేజ్డ్” అని  అదితి పోస్ట్ చేసింది. దీంతో అందరికీ జరిగింది ఎంగేజ్మెంట్ అన్న విషయం అర్థమైంది.


ఈ విషయం వైరల్ కావడంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా వీళ్ళకి విషెస్ తెలియజేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం నెటిజన్లు ఈ ఇద్దరికి సంబంధించి అన్ని విషయాల గురించి తెగ సర్చ్ చేస్తున్నారు. కెరీర్, ప్రేమ, పెళ్లి తో పాటుగా వీళ్ళ ఆదాయాల గురించి కూడా తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సంపాదన.. మూవీస్ కి వాళ్ళు తీసుకుని రెమ్యునరేషన్ పై చర్చలు జరుగుతున్నాయి. మరి ఆ వివరాలు ఏమిటో మనం కూడా తెలుసుకుందాం..


తెలుగుతో పాటుగా తమిళ్ ,హిందీ ఇండస్ట్రీలో కూడా సిద్ధార్థ హీరోగా సినిమాలు చేశాడు. 2003లో బాయ్స్ మూవీ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సిద్ధార్థ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. త్రిష నువ్వు వస్తానంటే నేనొద్దంటానా.. జెనీలియా బొమ్మరిల్లు.. ఇలా అతని ఖాతాలో మంచి కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత కాస్త అవకాశాలు తగ్గినా.. తిరిగి ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. ఇక అతని నికర విలువ విషయానికి వస్తే సుమారు 70 కోట్ల వరకు ఉండవచ్చని అంచన. సిద్ధార్థ దగ్గర ఇప్పుడు రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, ఆడి A4 లగ్జరీ కార్స్ ఉన్నాయి. వీటితోపాటుగా హైదరాబాద్, చెన్నై, ముంబై లాంటి సిటీస్ లో ఇల్లు ,ఆస్తులు ఉన్నట్లు టాక్.


మరోపక్క వనపర్తి రాజవంశస్తురాలు..అదితి రావ్ హైదరీ ఆస్తుల నికర విలువ 60 నుంచి 62 కోట్ల వరకు ఉంటుందని అంచన. ఆమె చేసే సినిమాలకు సుమారు కోటి వరకు రెమ్యూనరేషన్ రూపంలో పుచ్చుకుంటుందట. సినిమాలతో పాటుగా బ్రాండ్స్ ఎండార్స్మెంట్స్ ద్వారా అదితి 40 లక్షల వరకు సంపాదిస్తుంది. హైదరాబాద్ ,ముంబై నగరాలలో మాంచి  విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ క్యూఎల్ఎస్, బిఎమ్డబ్ల్యూ ఎక్స్ 7 లాంటి కార్స్ కలెక్షన్ ఉంది. పెళ్లయ్యాక వీళ్ళిద్దరి నికర విలువలు కలిపితే మొత్తం 130 కోట్లకు పైగా ఉంటుందని అంచన.


Also Read: Nita Ambani Visited Balkampet Temple: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు..


Also Read: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్‌ మీడియా అతిథులు



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook