Adivi Sesh Sister Marriage అడివి శేష్‌ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తన సోదరి పెళ్లి అంటూ అడివి శేష్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అడివి శేష్ తన సిస్టర్ పెళ్లి ఈవెంట్‌లో భాగంగా హల్దీ వేడుకలు జరుగుతున్నాయ్ అని చెప్పుకొచ్చాడు. ఇక తన చిట్టి చెల్లికి పెళ్లి కాబోతోందని, తామంతా కూడా తమ బావను ఇలా స్వాగతించామని చెప్పుకొచ్చాడు. తాను, తన తల్లి ఇద్దరూ సందడి చేస్తున్నామన్నట్టుగా అడివి శేష్ పోస్ట్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


అయితే చెల్లి పెళ్లి అని చెప్పడంతో అడివి శేష్‌ పెళ్లి మీద చర్చలు మొదలయ్యాయి. నీ పెళ్లి ఎప్పుడు అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి త్వరలోనే అడివి శేష్ సమాధానం చెప్పేట్టు కనిపిస్తోంది. అసలే ఇప్పుడు అడివి శేష్ డేటింగ్, లవ్ వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సుప్రియ యార్లగడ్డతో అడివి శేష్ డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్లు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి.


అక్కినేని వారింట్లో జరిగిన న్యూ ఇయర్, సంక్రాంతి సంబరాల్లో అడివి శేష్ పాల్గొన్నట్టు తెలుస్తోంది. బయటకు వచ్చిన ఫోటోల్లో మాత్రం సుప్రియ, అడివి శేష్ కాస్త సన్నిహితంగానే కనిపిస్తున్నారు. అలా ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే అంతా ఫిక్స్ అయ్యారు. కానీ వాటిపై అడివి శేష్‌ గానీ, సుప్రియ గానీ ఎప్పుడూ స్పందించలేదు. వాటిని ఖండించనూ లేదు.


అడివి శేష్‌కు గత ఏడాది బాగానే కలిసి వచ్చింది. మేజర్, హిట్ 2 సినిమాలు బ్లాక్ బస్టర్‌ హిట్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు మళ్లీ అడివిశేష్ రెట్టింపు ఫాంతో రెడీ అవుతున్నాడు. గూఢచారి 2 సినిమాను ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కాబోతోన్నట్టుగా తెలుస్తోంది.


Also Read:  Rajamouli murder Plan : రాజమౌళి హత్యకు కుట్ర.. హెచ్చరించిన రామ్ గోపాల్ వర్మ


Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి