Rajamouli murder Plan : రాజమౌళి హత్యకు కుట్ర.. హెచ్చరించిన రామ్ గోపాల్ వర్మ

Rajamouli murder Plan రాజమౌళిని చంపేందుకు కుట్ర జరుగుతోందట. దాని కోసం అంతా కూడా మూకుమ్మడిగా ప్లాన్ చేస్తున్నారట. అందులో తాను కూడా ఉన్నాడట. కానీ తాను నాలుగు పెగ్గులు తాగడంతో అంతా బయటకు చెప్పేస్తున్నాడట.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2023, 08:17 AM IST
  • రాజమౌళితో జేమ్స్ కెమరూన్‌ ముచ్చట్లు
  • కుళ్లుకున్న రామ్ గోపాల్ వర్మ
  • రాజమౌళి హత్యకు కుట్ర?
Rajamouli murder Plan : రాజమౌళి హత్యకు కుట్ర.. హెచ్చరించిన రామ్ గోపాల్ వర్మ

murder Plan on Rajamouli దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఉంది. జేమ్స్ కెమరూన్ వంటి వాడే.. రాజమౌళి తీసిన సినిమా గురించి, అందులోని సీన్స్ గురించి అంత గొప్పగా వివరిస్తూ వస్తే.. ఎవ్వరికైనా సరే ఈర్ష్య పుడుతుంది. ఇక మన ఇండియన్ డైరెక్టర్లలో చాలా మంది అలానే ఉన్నారట. వారంతా కలిసి ఓ కూటమిలా ఏర్పడి రాజమౌళిని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆ గ్రూపులో తాను కూడా ఉన్నానని, అయితే తనకు నాలుగు పెగ్గులు పడటంతో ఇలా బయటపెట్టేశానని వర్మ ట్వీట్ వేశాడు.

 

జేమ్స్ కెమరూన్‌ రాజమౌళి ముచ్చట్లు పెట్టిన వీడియో మీద వర్మ స్పందించాడు. మొఘల్ ఈ ఆజాం తీసిన కా ఆసిఫ్ నుంచి.. షోలే తీసిన రమేష్‌ సిప్పీ వరకు అందరినీ నువ్ అధిగమించావ్.. ఆదిత్య చోప్రాలు, కరణ్‌ జోహర్‌లు, భన్సాలి వంటి వారిని దాటేశావ్.. నీ కాలి బొటనవేలుని చీకాలని ఉంది అంటూ రాజమౌళిని వర్మ వేడుకున్నాడు. అనంతరం ఇంకో ట్వీట్ వేసి ఆశ్చర్యపరిచాడు.

రాజమౌళి సర్ దయచేసి మీరు మీ భద్రతను పెంచుకోండి.. ఇండియాలోని ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా మీద ద్వేషంతో రగిలిపోతోన్నారు.. వారంతా గూడు పుటాని చేస్తున్నారు.. మిమ్మల్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నారు.. అందులో నేను కూడా ఉన్నాను.. కానీ నాకు నాలుగు రౌండ్లు పడే సరికి ఇలా చెప్పేశాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.

అయితే నిజంగానే అలా ఎవరైనా చేస్తారా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి హత్యకు కుట్ర అనేది కేవలం వర్మ వాడిన పదాలు మాత్రమే అని తెలుస్తోంది. రాజమౌళి గొప్పను చెప్పేందుకు, అతన్ని చూసి మిగతా వాళ్లు ఎంతగా జెలసీ ఫీల్ అవుతున్నారో చెప్పే క్రమంలోనే అలా అన్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా మరో కొత్త చర్చకు మాత్రం వర్మ దారి తీశాడు.

Also Read:  Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే

Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News