Adivi Sesh's Major Movie Trailer released: శశి కిరణ్‌ దర్శకత్వంలో అడివి శేష్‌, శోభిత ధూళిపాళ హీరోహీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం 'మేజర్‌'. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్, జీఎంబీ బ్యానర్‌ల మీద ఈ చిత్రాన్ని నిర్మించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా మేజర్‌ సినిమా రూపొందింది. పాన్‌ ఇండియా చిత్రంగా వస్తున్న మేజర్‌ చిత్రం జూన్ 3న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేజర్‌ చిత్రం విడుదల తేదికి సమయం దగ్గరపడుతుండడంతో కొద్దిసేపటి క్రితం చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఒక్కో భాషలో ఒక్కో స్టార్‌ హీరో ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. తెలుగులో మహేశ్‌ బాబు, హిందీలో సల్మాన్‌ ఖాన్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విడుదల చేశారు. 2 నిమిషాల 28 సెకండ్ల నిడివిగల తెలుగు ట్రైలర్‌ ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బాల్యం, ఉద్యోగం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటలు ట్రైలర్‌లో కళ్లకు కట్టాయి. 


'బోర్డర్ దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లడం ఏంటి' అనే డైలాగ్‌తో మేజర్‌ ట్రైలర్ మొదలవుతుంది. 'వాళ్లు మంచివాళ్లు కాదు.. పెద్దపెద్ద తప్పులు చేసేవాళ్లు', 'ఇండియన్ ఆర్మీ అంటే బయమేస్తుందిరా.. నీకేమన్నా అయితే', 'సందీప్ ఆర్మీలో జాయిన్ కావడం నాకు ఇష్టం లేదు', 'వాడికి మంచి కొడుకుగా, భర్తగా ఉండంకంటే.. ఒక సోల్జర్‌గా ఉండడం అవసరం' అనే డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక చివర్లో చెప్పిన డైలాగ్ అయితే హైలెట్. 'తప్పించుకునే దారి ఉంది.. ముందుకెళ్తే చనిపోతామని తెలుసు.. అయినా కూడ వెళ్లాడు. చావు కళ్లల్లోకి చూసి.. నువ్వు నా జీవితాన్ని తీసుకోవచ్చు గానీ నా దేశాన్ని కాదు' అని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ అందరి కంట నీళ్లు తెప్పించాయి. 


ట్రైలర్ చూస్తుంటే 'మేజర్' సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యాన్ని, యవ్వనాన్ని, ఆర్మీలో చేరాలన్న కోరిక, ఆ తరవాత ఏమైంది అనేది డైరెక్టర్ శశి కిరణ్‌ అద్భుతంగా తెరకెక్కించాడని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్స్, అడివి శేష్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ చూస్తుంటే అడివి శేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ కానుంది. 


Also Read: Shraddha Das Saree Pics: చీర కట్టులో శ్రద్ధా దాస్ అందాల ఆరబోత.. అది నడుమా లేక నయాగరా జలపాతమా!


Also Read: LIGER Hunt Theme Out : 'లైగర్' హంట్ థీమ్ విడుదల.. వేటాడే సింహంలా విజయ్ దేవరకొండ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook