Tollywood Awards : దుబాయ్‌లో ఈరోజు ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెసెంట్ చేసిన  గామా తెలుగు మూవీ అవార్డ్స్ నాలుగవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా  జరిగింది. ఈ అవార్డుల ఫంక్షన్ ని ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ అవార్డుల ఫంక్షన్లో గత మూడు సంవత్సరాల కు గాను అనగా  2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలనుంచి - బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వంటి 42 కేటగిరీలకు అవార్డ్స్ అందజేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ అవార్డుల ఈవెంట్ కొరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ  నుంచి అతిరథ మహారధులు హాజరయ్యారు. ముందుగా మంచు మనోజ్ ఉత్తమ నటులుగా ఎంపికైన
తేజ సజ్జ, ఆనంద్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థ, సందీప్ కిషన్ కి అవార్డులు అందజేశారు. మరోపక్క  హీరోయిన్లు ఆషిక రంగనాథ్, నేహా శెట్టి, డింపుల్ హయతి, దక్ష నగార్కర్, ఫరియ అబ్దుల్లా  గామా అవార్డులు అందుకోవడమే కాకుండా అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు సైతం సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గానూ.. గామా మూవీ ఆఫ్ ది డికేడ్ అవార్డు రాగా ఆ అవార్డుని చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య  అందుకున్నారు. అలానే  ఉత్తమ చిత్రాలుగా పుష్ప, బ్రో, సీతారామం గామా అవార్డులు అందుకోగా.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు గా దేవి శ్రీ ప్రసాద్, తమన్, హేషం అబ్దుల్ వహాబ్ అవార్డులు అందుకున్నారు.


ఉత్తమ ఆల్బమ్ గా సీతారామం నిలవగా ఉత్తమ గాయని గాయకులుగా అనురాగ్ కులకర్ణి, ధనుంజయ్, హారిక నారాయణ్, ఎంఎల్ శృతి, మౌనిక యాదవ్ గామాబాదుని సొంతం చేసుకున్నారు. ఇక 25 సంవత్సరాల సంగీత దర్శకులుగా కొనసాగి ఎన్నో అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు ఎం ఎం శ్రీలేఖ కు గామా పురస్కారం అందజేశారు.


ఈ నేపథ్యంలో గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ.."వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక‌ జరగటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గామా స్థాపించినప్పటి నుండి.. గామా అవార్డు వేదికకు సహాయ, సహకారాలు అందిస్తూ.. అవార్డు ఫంక్షన్‌ను ప్రసారం చేస్తున్న ఈటీవీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు,” అని చెప్పుకొచ్చారు.  


కాగా గామా అవార్డు గ్రహీతలు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి :


గామా మూవీ ఆఫ్ ద ఇయర్ 2021 - పుష్ప (మైత్రి మూవీ మేకర్స్.. యలమంచిలి రవి నవీన్ యెర్నేని)


గామా మూవీ ఆఫ్ ద ఇయర్ 2022 - సీతారామం (వైజయంతి  మూవీస్.. స్వప్న, ప్రియాంక దత్)


గామా మూవీ ఆఫ్ ది ఇయర్ 2023 - బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వప్రసాద్)


గామా బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2021 - హర్షిక రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ)


గామా బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2022 - దక్ష నగర్ (జాంబిరెడ్డి)


గామా బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2023 - డింపుల్ హయతి (ఖిలాడి)



గామా బెస్ట్ హీరోయిన్ 2021 - ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు)


గామా బెస్ట్ హీరోయిన్ 2022 - మృణల్ ఠాకూర్ (సీతారామం)


గామా బెస్ట్ హీరోయిన్ 2023 - సంయుక్త మీనన్ (విరూపాక్ష)



గామా బెస్ట్ యాక్టర్ 2021 - అల్లు అర్జున్  (పుష్ప)


గామా బెస్ట్ యాక్టర్ 2022 - నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2)


గామా బెస్ట్ యాక్టర్ 2023 - ఆనంద్ దేవరకొండ  (బేబీ)



గామా బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ - తేజ సజ్జా (హనుమాన్)



గామా బెస్ట్ డైరెక్టర్ 2021 - సుకుమార్  (పుష్ప)


గామా బెస్ట్ డైరెక్టర్ 2022 - హను రాఘవపూడి (సీతారామం)


గామా బెస్ట్ డైరెక్టర్ 2023 - బాబీ కొల్లి  (వాల్తేరు వీరయ్య)


గామా జ్యూరీ బెస్ట్ యాక్టర్ 2022 - విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం)


గామా జ్యూరీ బెస్ట్ యాక్టర్ 2023 - సందీప్ కిషన్ (మైకేల్)


గామా బెస్ట్ ఆల్బమ్ 20 22 - సీతారామం (విశాల్ చంద్రశేఖర్)


గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2022 - ఎస్ ఎస్ తమన్ (భీమ్లా నాయక్)


గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 20 23 - హేశం అబ్దుల్ వహాబ్ (ఖుషి)



గామా బెస్ట్ లిరిసిస్ట్ 2023 - కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి దసరా)


గామా బెస్ట్ వర్సటైల్ యాక్టర్ - మురళీ శర్మ


గామా జ్యూరీ మెంబర్ - వీ ఎన్ ఆదిత్య (గామా జ్యూరీ)


గామా మోస్ట్ పాపులర్ సాంగ్ 2021 - నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్)


గామా మోస్ట్ పాపులర్ సాంగ్ 2023 - పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్)


గామా మూవీ ఆఫ్ ది డెకేడ్ - ఆర్ ఆర్ ఆర్


గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2022 - అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల- శ్యాం సింగరాయ్)


గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2023 - రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం - దసరా)


గామా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ - నెక్లెస్ గొలుసు (రఘు కుంచె)


గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2022 - హారిక నారాయణ (లాహే లాహే ఆచార్య)


గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2023 - చిన్మయి (ఆరాధ్య - ఖుషి)


గామా బెస్ట్ పాపులర్ సాంగ్ 2021 - మౌనిక యాదవ్ (సామి  నా సామి - పుష్ప)


గామా గద్దర్ మెమోరియల్ అవార్డు  : ఫోక్ సింగర్ నల్లగొండ గద్దర్ నరసన్న


గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్  2021 - ధనుంజయ్ (నా మది నీదదై)


గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2021 - ఎం ఎల్ శృతి (అడిగా అడిగా)


 


Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..


Read More: Pragya Jaiswal Bikini Pics: బికినీలో బ్లాస్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్.. మరి ఇంతలానా..!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook