Mega Family - Klin Kara: క్లీంకారా ప్రస్తుతం ట్రెండింగ్   లో ఉన్న పేరు. రామ్ చరణ్, ఉపసాన దంపతులు గతేడాది క్లీంకారాకు జన్మనిచ్చారు. అప్పటి నుంచి వాళ్ల కుటుంబంలో అన్ని శుభాలే జరగుతున్నాయి. ఒకదాని వెంట మరొకటి వాళ్ల కుటుంబానికి ఆనందం కలిగించే వార్తలే వస్తున్నాయి. క్లీంకార రాకతో మెగా కుటుంబానికి మూల స్థంభం అయిన మెగస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ తో గౌరవించింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగాభినులు పండగ చేసుకున్నారు. ఇంకోవైపు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. దీంతో ఆయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీ.. బీజేపీ, టీడీపీ కూటమితో కలిసి ప్రభంజనం సృష్టించింది. అంతేకాదు పోటీ చేసిన రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 21 శాసన సభ స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన తొలి పార్టీగా జనసేన సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఏపీ శాసనసభలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.


మరోవైపు వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఒక రకంగా క్లీంకారా వచ్చిన తర్వాత మెగా కుటుంబంలో జరిగిన మరో అద్భుతం. ఈ రకంగా క్లీంకారా పుట్టిన తర్వాత తండ్రి రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ తో పాటు తాత చిరంజీవికి పద్మవిభూషణ్.. అందుకున్నారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో సంచలనం రేపడంతో అందరు ఇదంత క్లీంకారా ఏ సమయంలో కుటుంబంలో అడుగుపెట్టిందో అన్నింట్లో మెగా కుటుంబానికి అంతా మంచి జరిగింది. దీంతో మెగాభిమానులు అందరు క్లీంకారాను లక్కీ గర్ల్ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook