prabhas unstoppable episode ఆహా అన్ స్టాపబుల్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య హెస్ట్ చేస్తోన్న ఈ షోకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. మొదటి సీజన్ పూర్తిగా సినిమాటిక్‌గా ఉంది. కానీ రెండో సీజన్‌కు రాజకీయ రంగు పూసినట్టుంది. కాంగ్రెస్, టీడీపీ నాయకులను పట్టుకొచ్చాడు బాలయ్య. అయితే ఈ రెండో సీజన్ ముగింపు సమయంలో మాత్రం అదిరిపోయేలా ప్లాన్స్ వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్ స్టాపబుల్ రెండో సీజన్ ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. బాలయ్య ప్రభాస్ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్లు రావడంతో ఒక్కసారిగా ఆహా పేరు మార్మోగిపోయింది. ప్రభాస్‌ను తీసుకొచ్చి ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభాస్ ఎపిసోడ్‌కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.


 



మామూలుగా అయితే ప్రభాస్ ఎపిసోడ్‌ను న్యూఇయర్ స్పెషల్‌గా ప్ట్రీమింగ్ చేద్దామని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అందులో చిన్న మెలిక పెట్టేశారు. ఈ ఎపిసోడ్‌ షూట్ చేసిన తరువాత ఇందులో ఎడిట్ చేయాలంటే ఎడిటర్లకు కూడా మనసు రాలేదట. అందుకే అలానే మొత్తం పెట్టేస్తున్నారట.


అందుకే ఈ ఎపిసోడ్‌ను రెండు పార్టులుగా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. అందులో మొదటి ఎపిసోడ్ న్యూ ఇయర్ స్పెషల్‌గా డిసెంబర్ 30న వదులుతారట. ఇక రెండో పార్టును జనవరి 6న విడుదల చేస్తారట. మొత్తానికి ప్రభాస్ ఎపిసోడ్ మీద ఏర్పడ్డ క్రేజ్‌ను ఆహా ఇలా వాడేస్తోందన్న మాట. ఇక ఇదే రెండు పార్టులు అంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ను ఇంకెన్ని పార్టులు వదులుతుందో చూడాలి. మొత్తానికి ఆహా మాత్రం గట్టిగానే ప్లాన్స్ వేసినట్టు కనిపిస్తోంది.


Also Read : Ananya Panday pics : ప్యాంట్ మరిచిపోయిన బ్యూటీ.. అనన్య పాండే అందాల ప్రదర్శన.. పిక్స్ వైరల్


Also Read : Harish Shankar : సార్ ప్లీజ్ సార్.. అడుకుంటున్నా పట్టించుకోని అధికారులు.. హరీష్‌ శంకర్ అసహనం


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి