Aishwarya Rajesh Clarity on Her Comments about Rashmika Mandanna: ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తమిళ్ లో సెటిల్ అయినప్పటికీ ఆమె తెలుగు అమ్మాయి. ఆమె తండ్రి దివంగత రాజేష్ కూడా పలు సినిమాల్లో నటించారు హీరోగా కూడా ఒక రెండు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఆయన కుమార్తె ఐశ్వర్య రాజేష్ కూడా సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తమిళంలో ఇప్పటికే హీరోయిన్గా ఆమె అనేక సినిమాల్లో నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ సినిమా లవర్ సినిమాలో ఆయన భార్య పాత్రలో నటించింది. నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో నటించింది. ఇక ఆమె మే 12 వ తేదీన ఫర్హానా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాష్మిక మందన్న గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆమె వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో తాను పోషించిన పాత్రకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని తనకు ఎలాంటి పాత్ర సూట్ అవుతుందని అడిగితే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.


Also Read: Puri Jagannadh: 'పూరీ జగన్నాధ్'ను డబ్బు వెనక్కడిగే హక్కుందా?


ఇక ఈ సినిమాలో రష్మిక బాగా చేసింది కానీ నేనైతే ఇంకా బాగా ఫిట్ అయి ఉండేదాన్నేమో అని ఆమె అభిప్రాయపడింది. అయితే ఆమె కామెంట్స్ వేరే విధంగా ప్రేక్షకుల్లోకి వెళుతున్న నేపథ్యంలో ఆమె తన తరుపు నుంచి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూలో తనను ఎలాంటి పాత్రలు తెలుగులో చేయాలని ఉంది అని అడిగితే తనకు తెలుగు సినీ పరిశ్రమ అంటే ఇష్టమని ఎలాంటి పాత్ర అయినా చేస్తానని చెబుతూనే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర అంటే తనకు ఇష్టమని తనకు ఆ పాత్ర సూట్ అవుతుందని చెప్పానని పేర్కొన్నారు.


అయితే తన మాటలు వేరే విధంగా బయటకు వెళ్లాయని ఒకరకంగా రష్మిక మందన గురించి నేను తప్పుగా మాట్లాడినట్లు బయటకు రిపోర్ట్ అయిందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాను క్లారిటీ ఇస్తున్నానని, తనకు నచ్చిన పాత్ర అది అని మాత్రమే చెప్పాను తప్ప తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. నాకు ఆమె పాత్ర బాగా నచ్చిందని ఆమె కూడా బాగా నటించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక తాను ఆమెను ఏదో అన్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఇక్కడితో ఆపేయాలని కోరారు.


Also Read: Keerthy Suresh: దుబాయ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి కీర్తి బర్త్ డే విషెస్..కొత్త చర్చ షురూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి