Keerthy Suresh: దుబాయ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి కీర్తి బర్త్ డే విషెస్..కొత్త చర్చ షురూ!

Keerthy Suresh wishes to Dubai relator: తన సోషల్ మీడియా వేదికగా దుబాయిలో సెటిల్ అయిన ఒక మలయాళీ వ్యక్తికి హ్యాపీ బర్త్డే చెప్పింది కీర్తి సురేష్. ఇలా ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

Written by - Chaganti Bhargav | Last Updated : May 17, 2023, 07:16 PM IST
Keerthy Suresh: దుబాయ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి కీర్తి బర్త్ డే విషెస్..కొత్త చర్చ షురూ!

Keerthy Suresh with Dubai relator: అలనాటి నటి మేనక కుమార్తె కీర్తి సురేష్ చిన్ననాటి నుంచి మలయాళంలో పలు సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఆమె బాలనటిగా నటించిన దాదాపు అన్ని సినిమాలు అక్కడ హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత ఆమె గీతాంజలి అనే సినిమాతో మలయాళ పరిశ్రమలో హీరోయిన్గా లాంచ్ అయింది.  కానీ పెద్దగా గుర్తింపు అయితే దక్కలేదు. ఇక తెలుగు విషయానికి వస్తే ఆమె నరేష్ కుమారుడు విజయకృష్ణ నవీన్ హీరోగా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది.

కానీ ఆ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే ఆ సినిమా తర్వాత ఆమె నటించిన మరో సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు మొదటి సినిమాగా వచ్చి ఆమె బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. నేను శైలజా పేరుతో ఆమె చేసిన సినిమా అటు రామ్ కెరియర్ లో కూడా లారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత కీర్తి సురేష్ కి తెలుగులో మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్లు ఆవుతూ వచ్చాయి. అలా ఆమెకు మహానటి సినిమా అవకాశం రావడం సావిత్రి పాత్రలో నటించడంతో ఆమె క్రేజ్ అయితే ఒక్కసారిగా మారి పోయింది.

Also Read: Kavya Thapar Photos: అసలు బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టుగా కావ్య థాపర్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరు!

అయితే ఆ తర్వాత ఆమె చేసిన ఏ సినిమా కలిసి రాకపోయినా ఆమె మాత్రం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అనుభవిస్తుంది. ఈ మధ్యనే దసరా సినిమాతో హిట్టు కొట్టిన ఆమె తన సోషల్ మీడియా వేదికగా దుబాయిలో సెటిల్ అయిన ఒక మలయాళీ వ్యక్తికి హ్యాపీ బర్త్డే చెప్పింది. ఫర్హాన్ బిన్ లియాఖత్, దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కీర్తి సురేష్ ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

వారిద్దరూ ఎల్లో జాకెట్లలో కనిపిస్తూ ఉన్న ఫోటో కూడా షేర్ చేయగా ఇప్పుడు ఈ ఫోటో కొత్త చర్చకు దారితీస్తోంది.  వారిద్దరూ మంచి స్నేహితులనే వార్త ముందు బయటికి రాగా తర్వాత రహస్య స్నేహితులు కూడా అనే వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. నిజానికి ఈ మలయాళీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి కేరళకి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. కీర్తి సురేష్ కుటుంబం కూడా కేరళ నుంచి వచ్చిందే కాబట్టి ఆమెకు కూడా అతనితో స్నేహం ఉండి ఉండవచ్చని అంటున్నారు.
Also Read: Shraddha Das Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో కైపెక్కిస్తున్న శ్రద్దా దాస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News