Ajith Kumar: వెంట్రుక వాసిలో కారు ప్రమాదం నుంచి బైటపడ్డ హీరో అజిత్.. షాకింగ్ వీడియో..
ajith kumar racing car accident: హీరో అజిత్ కుమార్ ప్రయాణిస్తున్న రెసింగ్ కారు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో అది అదుపు తప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది.
Ajith kumar escaped from car accident video: తమిళ హీరో అజిత్ కుమార్ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డట్లు సమాచారం. ఆయన ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనేందుకు దుబాయ్ కు వెళ్లినట్లు తెలుస్తొంది. అక్కడ ప్రాక్టిస్ లో భాగంగా.. రేసింగ్ కారు నడిపిస్తున్నారు. అది అదుపు తప్పి.. పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తొంది. దీంతో కారు బొంగరాలు తిరుక్కుంటూ వెళ్లి ఆగింది.
వెంటనే మరో కారులో అక్కడున్న సిబ్బంది చేరుకుని హీరో అజిత్ ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే.. అజిత్ కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఈ ఘటన తెలవగానే టెన్షన్ కు గురయ్యారంట. ప్రస్తుతం ఈ ప్రమాదం ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజిత్ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డారని కూడా అందరు చెప్పుకుంటున్నారంట.
మంగళవారం ప్రాక్టీస్ చేస్తుండగా, ఆయన నడుపుతున్న కారు కంట్రోల్ తప్పి రేస్ ట్రాక్‌లో ఉండే డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి.. వేగంగా ఆగిపొయింది. అజిత్ కు మాత్రం గాయాలు కాక పోవడంతో అందరు ఊపిరీ పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారు ప్రమాద ఘటనకు గల కారణాలపై ప్రస్తుతం అక్కడున్న వారు విచారణ చేపట్టారంట.
Read more: Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలి పోస్ట్ వైరల్.. ఈ పోస్ట్ లో ఏం చెప్పారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter