Akhil Pooja Hegde Dating అక్కినేని హీరోల్లో ఇప్పుడు ఎవ్వరూ కూడా అంత ఫాంలో లేరు. చివరకు నాగార్జున కూడా వరుస డిజాస్టర్లతో అందరినీ నిరాశపర్చుతూ వస్తున్నాడు. వైల్డ్ డాగ్ అంటూ అతి పెద్ద డిజాస్టర్ అందించాడు. నాగ చైతన్య థాంక్యూతో బోల్తా పడ్డాడు. ఇప్పుడు అఖిల్ ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూస్తోంది. అయితే అఖిల్ ఎంతలా కష్టపడ్డాడు.. ఎంతగా శ్రమించి బాడీని పెంచాడన్న సంగతి తెలిసిందే. కానీ ఆ శ్రమ అంతా వృథా అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా అఖిల్ ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ కోసం సుమ షోకు వచ్చాడు. ఏజెంట్ సినిమా రిలీజ్ కాక ముందు ఈ షోకు వచ్చినట్టున్నారు. అయితే ఇప్పుడు సినిమా డిజాస్టర్ టాక్ వచ్చి ఫ్లాపుగా నిలిచింది. ఇప్పుడు ఈ షోలో అఖిల్, హీరోయిన్ సాక్షి వచ్చి ప్రమోషన్స్ చేస్తుండటంతో మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది.


సుమ అడ్డా షో ప్రోమో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో అఖిల్ చెప్పిన విషయాలు మరింతగా వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్‌ అంటే తనకు ప్రాణమని, రామ్ చరణ్‌ తన గుండె చప్పుడని అన్నాడు. ఇక ఇంట్లోంచి గోడలు దూకి వెళ్లడం అనే విషయం ఇప్పటికీ నాన్నకు తెలియదని కొంటె రహస్యాలు చెప్పాడు. ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉన్న గోడను కట్టించారు.. ఏం లాభం నాగార్జున గారు అని సుమ కౌంటర్లు వేసింది.


Also Read:  Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి


ఏ హీరోయిన్‌తో డేటింగ్‌కు వెళ్తావ్ అని అడగ్గానే.. వెంటనే పూజా హెగ్డే పేరు చెప్పేశాడు అఖిల్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన బ్యాచ్‌లర్ సినిమా అంతో ఇంతో హిట్టైన సంగతి తెలిసిందే. మొదటి సారిగా అఖిల్‌కు కాస్తంత ఊపిరినిచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమానే. అయితే యాదృశ్చికంగా ఈ సినిమా తరువాత పూజా హెగ్డే నటించిన ఏ ఒక్క సినిమా కూడా హిట్టవ్వడం లేదు. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, కిసి కా భాయ్ కిసి కీ జాన్ ఇలా ఎన్నెన్నో సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. 


Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook