Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

Nani 30 Filming నాని ఇప్పుడు తన ముప్పవ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నాని ఇప్పుడు దసరా సినిమా హిట్టైన జోష్‌లో ఉన్నాడు. మాస్ సినిమాతో వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయ్యాడు. అలా నాని తదుపరి చిత్రాల మీద మంచి హైప్ పెరిగినట్టు అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2023, 10:33 AM IST
  • ఫుల్ స్వింగ్‌లో నాని సినిమా షూటింగ్
  • నాని 30లో మృణాళ్‌తో పాటు శ్రుతి హాసన్?
  • లుక్‌ ఇదేనా? కనిపించకుండా మ్యానేజ్ చేశాడా?
Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

Nani 30 Look నాని ఎక్కువగా ప్రయోగాలకు ఫేమస్. సినిమాలు హిట్టైనా, ఫట్టైనా కూడా ప్రయోగాలు మాత్రం మానడు. క్లాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు సినిమాలు చేస్తుంటాడు. మాస్ ఆడియెన్స్‌ను అలరించేందుకూ సినిమాలు చేస్తుంటాడు. అలా అటూ ఇటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటాడు నాని. నాని నటనకు ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. అయితే నానికి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చింది మాత్రం సినిమాలే. చివరగా వచ్చిన దసరా నాని రేంజ్‌ను అమాంతం పెంచేసింది.

నాని దసరా సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్బులో చేరిపోయింది. దీంతో నాని రేంజ్‌ ఒక్కసారిగా పెరిగింది. నాని సైతం రెమ్యూనరేషన్ పెంచినట్టుగా తెలుస్తోంది. అంతకు ముందు చేసిన అంటే సుందరానికీ సినిమా యావరేజ్‌గా నిలిచింది. సినిమా కథ, కథనాలు బాగానే ఉన్నా కూడా సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వలేదు. అందరూ కూడా నిడివి ప్రధాన సమస్య అని చెప్పుకొచ్చారు. మొత్తానికి నాని నటుడిగా అందులో మెప్పించినా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాడు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)

నాని దసరా సినిమాతో అందరి అంచనాలు తలకిందులు చేశాడు. ఇన్నేళ్లకు వంద కోట్లు కొల్లగొట్టేశాడు. యూఎస్‌లో రెండు మిలియన్ల డాలర్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చాడు. నైజాం ఏరియాలో నాని దసరాతో రికార్డులు క్రియేట్ చేశాడు. ఇలా నాని మీద ఇప్పుడు చాలానే రికార్డులున్నాయి. మరి తన నెక్ట్స్ సినిమా మాత్రం క్లాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. నాని అందులో ఓ పాపకు తండ్రిలా కనిపించబోతోన్నాడు. 

Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్

నాని 30వ సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన ప్రీ లుక్ అందరినీ ఆకట్టుకుంది. నాని ఓ ఆరేళ్ల పాపకు తండ్రిగా కనిపించబోతోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కూడా ఓ కీ రోల్ పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరంతా ఇప్పుడు గోవాలో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. నాని ఇప్పుడు తన లుక్ కనిపించకుండా మొహానికి మాస్క్ అడ్డం పెట్టుకుని ఇలా ఫోటోకు పోజులు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News