Urvashi Rautela With Akhil బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఇప్పుడు తెలుగులో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఉంది. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలోనూ పాటకు స్టెప్పులు వేసింది. చిరంజీవితో కలిసి ఊర్వశీ స్టెప్పులు వేసింది. ఇప్పుడు అఖిల్‌తో కలిసి ఏజెంట్ సినిమాలోనూ స్టెప్పులు వేసింది. ఐటం సాంగ్స్‌కు ఊర్వశీ ఫేమస్ అవుతోంది. అయితే తెలుగులో నేరుగా సినిమా కూడా రావాల్సి ఉంది. కానీ అది అంతకంతకూ ఆలస్యం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్య ఊర్వశీ ఎక్కువగా ట్రెండ్ అయింది. తన మీద వచ్చిన రూమర్లపై, ఆ రూమర్లను స్ప్రెడ్ చేస్తోన్న వ్యక్తిపై పరువునష్టం దావా వేయడంతో ఎక్కువగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో సెన్సార్ సభ్యుడినంటూ చెప్పుకుంటూ పిచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తుంటాడు. ఆ వ్యక్తి పేరు అందరికీ తెలిసిందే. ఉమైర్ సంధు అంటూ ఓ ట్విట్టర్ ఖాతా నుంచి సెలెబ్రిటీల పర్సనల్ విషయాలు, అఫైర్ల మీద పిచ్చి పిచ్చి రూమర్లు వస్తాయన్న సంగతి తెలిసిందే.


 



ఊర్వశీని అఖిల్ వేధించాడంటూ ఉమైర్ సంధు వేసిన ట్వీట్ రచ్చ రచ్చగా మారింది. ఆ రూమర్ల మీద ఊర్వశీ స్పందించింది. నువ్వేమీ నా పర్సనల్ పీఆర్ కాదు.. ఇలాంటి పిచ్చి పిచ్చి రూమర్లు ప్రచారం చేయడంతో జర్నలిజం మీదే విరక్తి కలుగుతోందన్నట్టుగా ట్వీట్ వేసింది. ఉమైర్ సంధు మీద డిఫమేషన్ కేస్ వేస్తున్నట్టుగా తెలిపింది. అలా ఊర్వశీ గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతూనే వస్తోంది.


Also Read: Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్


అఖిల్ ఏజెంట్ సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. ఎంతో కష్టపడి అఖిల్ చేసిన ఈ ఏజెంట్ సినిమా కథ, కథనాల వల్ల దెబ్బ కొట్టేసింది. అఖిల్ పడ్డ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక ఊర్వశీ చేసిన స్పెషల్ సాంగ్ కూడా వృథాగా మారింది. అయితే అఖిల్‌తో ఏడేళ్ల క్రితమే ఇలా ఫోటో దిగామంటూ ఊర్వశీ నాటి ఫోటోను షేర్ చేసింది. అందులో శ్రద్దా కపూర్ కూడా కనిపిస్తోంది. 


Also Read:  Rajamouli : ఎంత ప్రయత్నించినా లోపలకు వెళ్లనివ్వలేదు.. నాటి ఘటనపై నోరువిప్పిన రాజమౌళి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook