Akhil Akkineni's Agent Movie poster released on the eve of Birthday: కెరీర్ ఆరంభం నుంచి వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని అఖిల్‌.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' సినిమాతో ఓ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ సినిమా అఖిల్‌కు క‌మ‌ర్షియ‌ల్ హిట్టు మాత్రం ఇవ్వ‌లేక‌పోయింది. దాంతో ఎలాగైనా బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్టు కొట్టాల‌ని సురేంద‌ర్ రెడ్డితో సినిమా చేస్తున్నాడు అక్కినేని వారసుడు. సురేంద‌ర్ రెడ్డి, అఖిల్‌ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం 'ఏజెంట్‌'. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏజెంట్‌ సినిమా షూటింగ్‌ షరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌ ఏజెంట్‌ చిత్రంపై భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇక శుక్రవారం (ఏప్రిల్‌ 8) అఖిల్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ మరో పోస్ట‌ర్‌ విడుదల చేసింది. పోస్ట‌ర్‌లో అఖిల్ సిగ‌రెట్ తాగుతూ మాస్ లుక్‌లో ఉన్నాడు. కండ‌లు తిరిగిన దేహంతో అఖిల్ సరికొత్తగా క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రం కోసం అక్కినేని వారసుడు పూర్తీగా మేకోవ‌ర్ అయిన‌ట్లు పోస్టర్స్‌ ద్వారా తెలుస్తోంది.



నేడు అక్కినేని అఖిల్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఏజెంట్‌ చిత్రం నుంచి టీజ‌ర్‌ లేదా గ్లింప్స్‌ విడుదల అవుతుందని అక్కినేని అభిమానులు భావించారు. కానీ మేక‌ర్స్ పోస్ట‌ర్‌తోనే స‌రిపెట్టారురు. ఇందుకు మేక‌ర్స్ క్ష‌మాప‌ణ‌లు తెలుపుతూ.. మేలో టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఏజెంట్‌ సినిమా ఆగ‌స్టు 12న విడుదల కానుంది. ఈ సినిమాలో మ‌ల‌యాళ సూపర్ స్టార్ మ‌మ్ముట్టీ కీల‌క‌ పాత్ర‌లో న‌టిస్తున్న విషయం తెలిసిందే. అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తున్నారు. 


Also Read: Anrich Nortje: అన్రిచ్ నోర్జ్‌ను బౌలింగ్‌ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు.. కారణం ఏంటో తెలుసా?


Also Read: Cricketer Shravani GHMC: హైదరాబాదీ క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని కూల్చేసిన GHMC అధికారులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook