Cricketer Shravani GHMC: హైదరాబాదీ క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని కూల్చేసిన GHMC అధికారులు!

Cricketer Shravani GHMC: మహిళా క్రికెటర్ భోగి శ్రావణికి ఊహించని పరిణామం ఎదురైంది. సికింద్రాబాద్ సమీపంలోని తుకారాం గేట్ వద్ద శ్రావణి కుటుంబం నివాసం ఉంటుండగా.. జీహెచ్ఎంసీ అధికారులు గత బుధవారం ఆ ఇంటిని కూల్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 12:07 PM IST
Cricketer Shravani GHMC: హైదరాబాదీ క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని కూల్చేసిన GHMC అధికారులు!

Cricketer Shravani GHMC: హైదరాబాదీ మహిళా క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెటర్ భోగి శ్రావణి కుటుంబం నివసిస్తుంది. ఆమె తండ్రి బి. మల్లేష్ ప్లంబర్ గా పనిచేస్తుంటారు. అయితే వారు ఉంటున్న ఇల్లు ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని ఇటీవలే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

నోటిసులు ఇచ్చిన తర్వాత వారి ఇంటి వెనుక గోడ పడిపోయేలా ఉందని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అంటే బుధవారం (ఏప్రిల్ 6) సాయంత్రం వారి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. దీంతో పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్ కు క్రికెటర్ శ్రావణి కుటుంబం షిఫ్టు అయ్యింది. అయితే ఆ గోడకు మరమతులు చేయించినా.. జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి పరిశీలించలేదని క్రికెట్ శ్రావణి వాయపోయింది. ఇదే విషయమై క్రికెటర్ భోగి శ్రావణి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

35 ఏళ్లుగా ఆ ఇంట్లో క్రికెట్ శ్రావణి కుటుంబం ఉంటున్నట్లు సమాచారం. వారి ఇంటి వెనుక గోడ కూలిపోయేలా ఉందంటూ కొన్ని రోజుల క్రితం మాకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దానికి మరమతులు చేయించినప్పటికీ.. జీహెచ్ఎంసీ అధికారులు తమ ఇంట్లోని వస్తువులను బయట పడేసి మరి కూల్చివేయడంపై ఆమె కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ఈనెల 15 నుంచి పుదుచ్చేరిలో జరిగే మహిళా టీ-20 టోర్నమెంట్ లో భోగి శ్రావణి పాల్గొనాల్సింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను క్రికెట్ ఆడాలా? వద్దా అని సందేహంలో నెలకొన్నట్లు శ్రావణి కుటుంబసభ్యులు చెబుతున్నారు.  

Also Read: Governor Vs Government: కేసీఆర్ అవమానించారన్న గవర్నర్ తమిళి సై.. కౌంటరిచ్చిన కేటీఆర్

Also Read: TRS Leaders Mike Fight: టీఆర్ఎస్ నేతల మైక్ రచ్చ.. కవిత చేతిలోంచి మైక్ లాక్కున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News